ప్రకాశం

రైలు కింద పడి తల్లీకొడుకు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 11: ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలో అగ్రహారం రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున రైలు కింద పడి సుమారు 40 సంవత్సరాలు వయసు కలిగిన మహిళ, 12 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు మృతి చెందినట్లు ఒంగోలు రైల్వే పోలీసులు సోమవారం తెలిపారు. రైల్వే పోలీసుల కథనం మేరకుసోమవారం తెల్లవారుజామున అగ్రహారం గేటు వద్ద ఓ మహిళతోపాటు ఒక బాలుడు రైలు కింద పడి మృతి చెంది ఉండటాన్ని రైల్వే కీమాన్ గమనించినట్లు తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని కీమాన్ ఒంగోలు రైల్వేస్టేషన్ మాస్టర్‌కు పి నాగవర్ధన్‌రెడ్డికి సమాచారం తెలిపినట్లు తెలిపారు. దీంతో రైల్వేస్టేషన్ మాస్టర్ ఒంగోలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమేరకు ఒంగోలు రైల్వేస్టేషన్ ఎస్‌ఐ రహీంరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను రిమ్స్ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా వుండగా స్థానికులు మృతువుల బంధువులు అందించిన వివరాల మేరకు రైలు కింద పడి మృతి చెందినవారు ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్‌బిఐ బ్యాంక్ వద్ద ఒక హోటల్‌ను నిర్వహిస్తున్న బొమ్మిరెడ్డి సుధాకర్‌రెడ్డి భార్య శ్యామల, కుమారుడు పార్ధివ్‌రెడ్డిగా తెలిపారు. అయితే వీరు ఎందుకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తమకు తెలియరాలేదని తెలిపారు. రాత్రి 10 గంటల వరకు కుటుంబం అందరు కలిసి భోజనం చేశారని, అయితే తెల్లవారుజామున వారు రైలు కింద పడి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తమకు విషయం తెలియదని తెలిపారు. ప్రస్తుతం బొమ్మిరెడ్డి సుధాకర్‌రెడ్డి దైవదర్శనానికి శబరిమలై వెళ్లారని ఆయన మంగళవారం ఉదయం ఒంగోలుకు చేరుకుంటారని ఆ తరువాత మృతదేహాలను సుధాకర్‌రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మృత చెందిన శ్యామల సుధాకర్‌రెడ్డికి రెండవ భార్య అని, వీరి పార్ధివ్‌రెడ్డిగా తెలిపారు. సుధాకర్‌రెడ్డి మొదటి భార్య అయిన కవిత శ్యామల. మొదటి భార్య కవిత కూడా రైలు కింద పడి చనిపోయింది. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. తదనంతరం శ్యామలను వివాహం చేసుకున్నాడు.