ప్రకాశం

అరుగురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, డిసెంబర్ 11: పలు జిల్లా ల్లో అనేక కేసుల్లో నింధితులుగా ఉన్న అంతర్ జిల్లా దొంగలను చీరాల సబ్ డివిజన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను డి ఎస్పీ ప్రేమకాజల్ సోమవారం తన కార్యాలయం లో విలేకర్లకు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు బండి శివ, రమేష్, సిసింద్రి, రాములు కారులో గంజాయి తరలిస్తున్నారు. జె పంగులూరు మండలం అలవలపాడు క్రాస్‌రోడ్డు వద్ధ ఇంకొల్లు సిఐ ఎం శ్రీనివాసరావు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కారు దొంగతనం జరిగిన కేసుల్లో వారు నింధితులుగా తేలింది. పై నలుగురిపై రేణింగవరం పోలీసుస్టేషనులో నమోదు అయిన 116 బై 17 కేసులో అరెస్టు చేశారు. బండి శివ ఇచ్చిన సమాచారం మేరకు రేణింగవరం పోలీసు స్టేషనులో నమోదు అయిన 111బై 17 కేసుకు సంబంధించి ప్రభాకర్, లక్ష్మీ అలియాస్ స్వాతిలను బొల్లాపల్లి టోల్‌గేట్ వద్ధ అరెస్టు చేశారు. పై నింధితుల వద్ధ నుంచి రూ. 10.50లక్షల విలువైన 350 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. డి ఎస్పీ మాట్లాడుతూ గుంటూరుకు చెందిన బండి శివకుమార్‌పై 2004 సంవత్సరం నుంచి గుంటూరు, నెల్లూరు, కంభం, కృష్ణా, నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో సుమారు 50 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అదే జిల్లా పిడుగురాళ్లకు చెందిన మక్కెనపల్లి రమేష్ నాలుగు హత్యకేసుల్లో నింధితుడుగా ఉన్నట్లు తెలిపారు. 2010 నుంచి బండి శివతో కలిసి అతను దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. కనిగిరికి చెందిన చింతల సిసింద్రి, గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన పూజాల రాములుపై ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో సుమారు 30 దొంగతనం కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఐదేళ్ల క్రితం బండి శివను వివాహామాడిన పిడుగురాళ్లకు చెందిన వి లక్ష్మీ అలియాస్ స్వాతిపై గతంలో రెండు కేసులు ఉన్నాయన్నారు. శివ దొంగిలించిన బంగారం ఇతర వస్తువులను ఆమెతో పాటు గుంటూరుకు చెందిన బూదాటి ప్రభాకర్ అమ్ముతుండేవారని తెలిపారు. మొత్తం 18 కేసులకు సంబంధించి రూ. 18లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కింది స్థాయిలో హోంగార్డులు, కానిస్టేబుల్ సమర్థవంతంగా పనిచేస్తేనే అధికారులకు పేరొస్తుందని డి ఎస్పీ అన్నారు. అనంతరం కానిస్టేబుల్ నాగూర్, రత్నరాజు, హోంగార్డు నాగూర్‌కు డి ఎస్పీ రివాడ్ అందజేశారు. సమావేశంలో ఇంకొల్లు, చీరాల గ్రామీణ, ఒకటవ పట్టణ సి ఐలు శ్రీనివాసరావు, భక్తవత్సలరెడ్డి, సూర్యనారాయణ, మార్టూరు, రేణింగవరం, ఈపురుపాలెం ఎస్సైలు నాగమల్లేశ్వరావు, కె నాగరాజు, దాసరి ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.