ప్రకాశం

రిమ్స్‌లో ప్లేట్‌లెట్ మిషన్ ఏర్పాటుతో జిల్లా ప్రజల చిరకాల కోరిక తీరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 13: జిల్లా ప్రజల చిరకాల కోరిక రిమ్స్ ఆసుపత్రిలో ప్లేట్‌లెట్ మిషన్ ఏర్పాటుతో తీరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో 82.35లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన రక్తకణాల విభజన అనుబంధ పరికరాల ప్రాజెక్టును మంత్రులు కామినేని శిద్దా రాఘవరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో డెంగ్యూ జ్వరాలకు సంబంధించి ప్లేట్‌లెట్‌మిషన్ ఏర్పాటు చేయటంలో జిల్లామంత్రి, స్థానిక శాసనసభ్యులు,జిల్లాకలెక్టర్ ప్రత్యేకశ్రద్ద తీసుకున్నారన్నారు. ఒంగోలు మెడికల్ కాలేజికి ఎంసిఐ గుర్తింపు కోసం ఢిల్లీ వెళ్లి ప్రత్యేక కృషి చేసి సాధించామన్నారు. మెడికల్ కాలేజిలో అదనపు సీట్లు ఇచ్చేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు వైద్యశాలలు ప్రజలకు జ్వరం వచ్చినవెంటనే డెంగ్యూగా నిర్థారించకుండా ఎలీసా రక్తపరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే డెంగ్యూ జ్వరంగా నిర్థారించాలన్నారు. డెంగ్యూ జ్వరంగా నిర్దారణ అయితే వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు సమాచారం అందించాలన్నారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో గతంలో కంటే మెరుగైన వైద్యసౌకర్యాలు వైద్యులు అందిస్తున్నారన్నారు. ఔట్‌పేషెంట్ శాతం బాగా పెరిగిందన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో వాతావరణం పరిశుభ్రంగా ఉండేవిధంగా పొరుగు సేవల సిబ్బందిని నియమించటం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తరుచూ ఆసుపత్రులను సందర్శించినప్పుడే పరిస్ధితులు మెరుగుపడతాయన్నారు. జిల్లాలో విషజ్వరాలు ప్రబలినప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చురుకైన పాత్ర పోషించాలన్నారు. ఈసందర్బంగా వైద్య ఆరోగ్యశాఖాధికారులను మంత్రి ప్రశంశించారు. రిమ్స్‌లో ప్లేట్‌లెట్ మిషన్ ఏర్పాటుకు కలెక్టర్ వినయ్‌చంద్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుని జిల్లా మినరల్‌ఫండ్‌నుండి 82.35లక్షల రూపాయలు మంజూరు చేయటంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్టవ్రైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ కలెక్టర్‌ను సన్మానించారు. అనంతరం రిమ్స్ మెడికల్ కాలేజి బాలికల వసతిగృహంలో 1.50లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన జిమ్ సెంటర్‌ను రాష్టమ్రంత్రులు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీత, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, రిమ్స్ ఆసుపత్రి చైర్మన్ కె సీతారామయ్య, రిమ్స్ డైరెక్టర్ వల్లీశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి, ఎపివివిపి జిల్లా కోఆర్డినేటర్ ఉషా, రిమ్స్ వైద్యులు నామినేని కిరణ్‌కుమార్, రాజేశ్వరరావు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రానైట్ అక్రమ రవాణా
మార్టూరు, డిసెంబర్ 13 : కోట్ల రూపాయల విలువ చేసే గ్రానైట్ ఏ విధమైన పన్ను చెల్లించకుండానే రాష్ట్ర సరిహద్దు దాటుతుంది. మార్టూరు నుంచి రాజస్థాన్‌కు పైసా పన్ను లేకుండా గ్రానైట్‌ను తరలిస్తున్నారు. రోజుకు సుమారు 50 లారీలకు పైగా గ్రానైట్‌రాళ్లు అక్రమ రవాణా జరుగుతుంది. కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి పన్ను చెల్లించని లారీలను తెలంగాణాలో ప్రవేశపెట్టే వరకు ఒప్పంద పద్ధతిలో ఈ అక్రమ రవాణా కొనసాగుతుంది. మార్టూరు ఏరియాలో మాఫీయా కనుసన్నల్లో గ్రానైట్ లారీలు యద్ధేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటుతుంది. మార్టూరు నుంచి రాజస్థాన్‌కు గ్రానైట్ భారీగా తరలుతుంది. ఒకొక్క లారీకి 45వేల నుంచి 60వేల వరకు వాణిజ్య పన్నుల శాఖకు పన్ను రూపేనా చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఎగవేసేందుకు సంబంధిత గ్రానైట్ యాజమానులు మాఫీయాను ఆశ్రయిస్తున్నారు. ఏ విధమైన బిల్లులు పన్ను చెల్లింపు రశీదులు లేకున్నప్పటికీ లారీలను ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి తెలంగాణాలో ప్రవేశపెట్టడం ఈ మాఫీయా పని. అందుకు గాను గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని మాఫియాకు ఒక్కొక్క లారీకి 11వేల నుంచి 20వేల వరకు చెల్లిస్తుంటారు.
రాత్రి వేళల్లోనే ఎక్కువ: మార్టూరు నుంచి రాజస్థాన్‌కు గ్రానైట్ లారీలు రాత్రివేళల్లోనే ఎక్కువగా వెలుతుంటాయి. రాత్రి సమయంలోనే మాఫియా ముఠా వీటిని సరిహద్దులు దాటిస్తున్నారు. అందు కోసం వారి వద్ద చాలా మంది పనిచేస్తుంటారు. లారీ బయలుదేరగానే సమాచారం వీరికి వస్తుంది. గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన తరువాత మాఫియా ముఠాకు చెందిన మనుఘులు లారీని అనుసరిస్తారు. కొందరు కార్లు, మరికొందరు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ పోలీసు, వాణిజ్య పన్నుల అధికారులను గుర్తిస్తారు. అనుకూలమైన అధికారులు ఉన్న మార్గంలోనే లారీలను మళ్లిస్తుంటారు.
ఫోనులోనే సెటిల్‌మెంట్: ఒక వేళ కొత్త అధికారులు లారీని పట్టుకుంటే విషయం మొత్తం ఫోనులోనే సెటిల్‌మెంట్ అవుతుంది. మాఫీయాతో సంబంధం ఉందని భావిస్తున్న పెద్దలు అధికారులతో మాట్లాడుతుంటారు. కొందరు పెద్దలు నేరుగా ఈ వ్యవహారంలో తలదూర్చినట్లు తెలస్తుంది. మార్టూరు మండలంలో ఒక పెద్ద ప్రజాప్రతినిధి అండతో ఈ అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఈ విషయాన్ని వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఇప్పటికే పలువురు పేర్లను ప్రభుత్వానికి అందజేశారు. ఏ అధికారి ఉంటాడో ముందే తెలుస్తుంది: అక్రమంగా గ్రానైట్ లారీలు తరలిస్తున్న మాఫియా కేవలం పెద్దలనే కాదు ఉన్నతాధికారులను కూడా ప్రభావితం చేస్తుంది. తమకు అనుకూలమైన అధికారులు విధుల్లో ఉండేలా లాభియింగ్ చేస్తుంది. ఏ రోజు ఏ అధికారి డ్యూటీలో ఉండాలనేది కూడా మాఫియానే నిర్ణయిస్తుంది. గ్రానైట్ లారీలను అక్రమ పద్థతిలో రాష్ట్రం దాటించేందుకు మాఫియా సమాంతర వ్యవస్థను రూపొందించు తుంది.
అధికారుల వివరణ: గ్రానైట్ లారీల వ్వవహరంపై మైనింగ్ అధికారులు వివరణ ఇస్తు పన్ను చెల్లించుకుండా అక్రమ రవాణాతో లారీలు తరలిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. లారీలకు కొంత మొత్తం తీసుకుని లారీలను సరిహద్దు దాటిస్తున్నారని, అలాంటి వారిపై, అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
మొబైల్ తనిఖీల జాడేలేదు: జిఎస్‌టిని ప్రవేశపెట్టన దరిమిలా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో అక్రమ రవాణాకి మార్గం సుగమనం చేసినట్లు అయ్యింది. వాసవానికి జి ఎస్‌టి అమల్లోకి వచ్చిన వెంటనే సరిహద్దు చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో అటు వాణిజ్యపన్నుల శాఖ, సెంట్రల్ ఎక్సేంజ్ శాఖాధికారులు మొబైల్ తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. కాని అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. సెంట్రల్ ఎక్సైంజ్‌లో ప్రీ వేంటిస్ పార్టీలు(నిఘావిభాగం) సిటి విజిలెన్సు విభాగాలు ఉంటాయి. ఆయా విభాగాల అధికారులు సిబ్బందికి ఆకస్మిక తనిఖీలు చేసే అధికారాలు ఉంటాయి. అయినప్పటికి ఎక్కడా తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమ రవాణాదారులకు తలుపులు బోర్లా తెరిచినట్లు అయ్యింది.

ఎస్‌సి,ఎస్‌టి, బిసి,మైనార్టీ, బ్రాహ్మణ, కాపుకార్పొరేషన్లకు నిర్దేశించిన లక్ష్యాలను
నూరుశాతం పూర్తిచేయాలి
కలెక్టర్ వినయ్‌చంద్
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,డిసెంబర్ 13:ఎస్‌సి,ఎస్‌టి,బీసీ, మైనార్టీ,బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్‌లకు నిర్దేశించిన లక్ష్యాలను నూరుశాతం పూర్తిచేయాలని జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సిపిఒ సమావేశమందిరంలో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల్లో 90శాతం స్పాన్సర్‌షిప్ అందించినందుకు బ్యాంకు అధికారులను అభినందిస్తూ అదేవిధంగా యూనిట్లు గ్రౌండింగ్ వందశాతం చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలన్ని సమర్ధవంతంగా అమలుచేసుకోవాల్సి ఉందన్నారు. రబీసీజన్ ప్రారంభం అయినప్పటికి వర్షపాతం తక్కువుగా ఉందని,పశ్చిమప్రాంతంలో ఏర్పడిన కరువు పరిస్ధితులను ఎదుర్కొవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో కరువు పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని కౌలురైతులకు,వివిధ కార్పోరేషన్ల పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు బ్యాంకర్లు ఇతోధికంగా రుణాలు అందించి ఆదుకోవాలని బ్యాంకు అధికారులను కోరారు.క్రిస్టియన్ మైనార్టీకార్పోరేషన్‌కు సంబంధించిన యూనిట్లు ఈనెల 20వతేదీ లోగా నూరుశాతం పూర్తిచేయాలన్నారు. 2016-17, 2017-18 ఆర్థికసంవత్సరాల్లో నిర్ధేశించిన వివిధ కార్పోరేషన్లకు ఉన్న లక్ష్యాలను త్వరితగతిన సాధించాలన్నారు.జిల్లాలో ఈసంవత్సరం ఎనిమిదివేల ఎకరాల్లో పండ్లతోటలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించటం జరిగిందన్నారు. ఉద్యానవన శాఖలో డ్రిప్, స్పింక్లర్లను పెద్దఎత్తున ఉపయోగించేలా దృష్టిసారించామన్నారు. ఈసంవత్సరం కౌలు ధరలు పెరిగాయని కౌలు రైతులకు ఇచ్చే రుణాలు పెంచేవిధంగా బ్యాంకర్లు చూడాలన్నారు. రబీలో ఇప్పటివరకు జిల్లాలో 62శాతం పంటలు సాగుకాగాకేవలం 44శాతం మాత్రమే రుణాలు అందించారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పాడిపరిశ్రమ విస్తరణలో అత్యంత ప్రాధాన్యత ఉందని, వర్షపాతం తక్కువుగా ఉన్నందున పాడిపరిశ్రమ కీలకంగా మారే అవకాశం ఉందన్నారు. ఎన్‌టిఆర్ జలసిరి కింద జిల్లాకు 11వేల బోర్లు మంజూరు కాగా ఆరువేల మూడువందల బోర్లు వేయటం జరిగిందన్నారు. ఎంఎస్‌ఎంఇ సెక్టార్‌కింద స్టాండ్ అప్ ఇండియా పధకం కింద ప్రతిబ్యాంకు బ్రాంచి కనీసం ఇద్దరికి రుణాలు మంజూరుచేయాలని, వచ్చిన ధరఖాస్తులను సంబంధిత పోర్టర్‌లో ప్రాసెస్ చేపట్టాలన్నారు. ఎంఎస్‌ఎంఇ సెక్టారు క్రింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటిని ఈనెలాఖరునాటికి పరిష్కరించాలని,ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకర్లు తమవంతు ప్రొత్సాహం అందించాలని సూచించారు. స్టాండ్‌అప్ ఇండియా, ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ కార్యక్రమం, ప్రధానమంత్రి ముద్రయోజన పధకాలు ప్లాగ్‌షిప్ ప్రోగ్రాంలుగా గుర్తించి వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంలో శిశులోన్ కింద 50వేల రూపాయల వరకు, కిశోర్‌లోన్ కింద 50వేల రూపాయలనుండి ఐదులక్షల రూపాయల వరకు, అదేవిధంగా తరుణ్‌లోన్ కింద ఐదులక్షల రూపాయలనుండి పదిలక్షల రూపాయల వరకు రుణాలు అందించే అవకాశం ఉందన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 2017-18సంవత్సరంలో బ్యాంకు లింకేజి కింద 38వేల 493 గ్రూపులకు 882.42కోట్లరూపాయలు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 18వేల 118గ్రూపులకు 569.08కోట్లరూపాయలు ఇవ్వటం జరిగిందని 64.49శాతం సాధించటం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మురళీ డిసిసి సమావేశంలో వివరించారు. అదేవిధంగా ఎన్‌పిఏ 1.13గా ఉందని రాబోయే మూడునెలల్లో ఎన్‌పిఏ తగ్గించేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో కందుకూరు శాసనసభ్యులు పోతుల రామారావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో లోటు వర్షపాతం వలన వ్యవసాయరంగంలో సుమారు వెయ్యికోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలపరిమితిలో ప్రధానమంత్రి పసల్‌బీమాయోజన పధకం వందశాతం నమోదు అయ్యేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్ధితుల వలన భూగర్బజలాలు అడుగంటిపోయాయని, బోర్లు ఎండిపోయాయని, తాగునీటికి,సాగుకు కరువు ఏర్పడిందన్నారు. రైతులకు అందించే పంట నష్టపరిహారానికి బ్యాంకర్లు ఇతోధికంగా సహాయం అందించేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. రైతులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం, బ్యాంకు అధికారులు తోడ్పాటు అందించాలన్నారు. అన్నంపెట్టే రైతులను కాపాడాలని జిల్లాకలెక్టర్ పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఈసందర్బంగా నాబార్డు ద్వారా 2018-19కి సంబంధించి పొటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని కలెక్టర్ వినయ్‌చంద్ ఆవిష్కరించారు. ఈసమావేశంలో జాయింట్‌కలెక్టర్-2 డి మార్కండేయులు, వివిధ శాఖల అధికారులు ఎం వెంకటేష్, హరీష్‌బాబు, జ్యోతి శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.