ప్రకాశం

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రజకులను ఎస్సీజాబితాలో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, జనవరి 17: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి అడుగడుగున అవమానాలను ఎదుర్కొంటున్న రజకులను ఎస్సీజాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రజకుల డిమాండ్ మేరకు వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో జరిగిన డివిజన్ రజకుల ఆత్మీయసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2016 మార్చి 5న అసెంబ్లీలో గవర్నర్ తన ప్రసంగంలో రజకులను ఎస్సీజాబితాలో చేరుస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని, నేటికీ ఆహామీని అమలుపరచకపోవడంతో రజకుల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. హామీలను అమలు చేయకుండా జాప్యంతో కాలంవెళిబుచ్చడంతో చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని, రజకులంతా ఐక్యమత్యంతో ఉండి అమరావతిని ముట్టడించి చంద్రబాబును నిలదీసి డిమాండ్లను సాధించుకోవాలని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి రజకులను ఎస్సీజాబితాలో చేర్చేందుకు సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మాజీఎమ్మెల్యే కెపి కొండారెడ్డి మాట్లాడుతూ 1985లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు రజకులను ఎస్సీజాబితాలో చేరుస్తామని తీర్మానం చేశారని, ఆ తరువాత 2006లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎస్టీజాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో 2008 ఇందిరపార్కులో రజకగర్ణన సందర్భంగా, 2014లో పాదయాత్ర సందర్భంగా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని పదేపదే హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయారని తెలిపారు. రజకులు ఐక్య ఉద్యమాలు చేస్తేతప్పా ఎస్సీజాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం ముందుకురాదని అన్నారు. రాష్ట్రం మొత్తంగా రజకులంతా ఉద్యమాలుచేపట్టి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఎపి రజకసంఘం అధ్యక్షులు పన్నీటి కాశయ్య మాట్లాడుతూ రజకులు పుట్టినదగ్గర నుంచి గిట్టేవరకు అన్నికులమతాలకు అతీతంగా సేవలు చేస్తూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని, రజకులను ఎస్సీజాబితాలో చేర్చేందుకు గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర రజక సహకార సంఘాల సమాఖ్య నాయకులు కనిగిరి బాలవెంకటరమణ మాట్లాడుతూ భారతదేశంలోని 17 రాష్ట్రాల్లో, మూడు కేంద్రపాలితప్రాంతాల్లో రజకులను ఎస్సీజాబితాలో చేర్చారని, మిగిలిన 12 రాష్ట్రాల్లో బిసిజాబితాలో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 21లక్షల మంది రజకులు ఉన్నారని, 67 సంవత్సరాల నుంచి ఎస్సీజాబితాలో చేర్చాలని పోరాటం చేస్తున్నప్పటికీ ఆ దిశగా పాలకులు దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని అన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో రజకులను ఎస్సీజాబితాలో చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో రజకసంఘం జిల్లాఅధ్యక్షులు పి నారాయణ, గుర్రం సుబ్బన్న, పొదిలి శ్రీనివాసరావు, పి జయరాం, చందలూరి కాశయ్య, టి శ్రీనివాసులు, సిహెచ్ మాల్యాద్రి, బి సుబ్బయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా డివిజన్‌లోని 14మండలాల నుంచి వచ్చిన రజకులతో పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు.