ప్రకాశం

డబ్లింగ్ పనులు ముగిసే వరకు నూతన రైళ్లు ఏర్పాటు చేయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జనవరి 17: గుంటూరు - గుంతకల్లు రైలుమార్గం డబ్లింగ్ పనులు జరుగుతున్న దృష్ట్యా ఇప్పట్లో నూతన రైళ్ళు ఏర్పాటు చేయడం సాధ్యంకాదని దక్షణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక మార్కాపురం రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ నల్లమల అటవీప్రాంతంలో సుమారు 55 కిలోమీటర్లమేర డబ్లింగ్ పనులు జరగాల్సి ఉందని, ఆ పనులు పూరె్తైతే అప్పుడు ప్రజల కోరికమేరకు నూతన రైళ్ళను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నం రైల్వేజోన్ ఏర్పాటు చేయడం తన పరిధిలోలేదని, రైల్వేబోర్డు సమావేశం నిర్వహించి వారు నిర్ణయం తీసుకోవాలని, అనంతరం కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. అయితే దేశంలో 29రాష్ట్రాలు ఉంటే అన్నిరాష్ట్రాలకు రైల్వేజోన్లు ఇవ్వడం కుదరదని, ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి రైల్వేజోన్ల కోసం రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు అందాయని, వీటన్నింటిని అమలు చేయడం కష్టసాధ్యమని అన్నారు. గుంటూరు - నంద్యాల మధ్య ఎలక్ట్రికల్ లైన్ల ఏర్పాటు కోసం పనులు జరుగుతున్నాయని, త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం - పెద్దదోర్నాల వరకు రైల్వేలైను ఏర్పాటు కోసం సర్వే నిర్వహించాలని కోరారు. గతంలో ఈ రైల్వేలైను కోసం గత ప్రభుత్వాలు ప్రతిపాదనలు తయారుచేసి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయడం జరిగిందని, పెద్దదోర్నాల నుంచి దేశంలోనే అతిపెద్దశైవక్షేత్రంగా పేరొందిన శ్రీశైలం వెళ్ళే ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అలాగే నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైను పనులు జరుగుతున్నందున మార్కాపురంకు కేవలం 40కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించి మార్కాపురం నుంచి పొదిలి వరకు రైల్వేలైను పొడిగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. రైల్వేప్రయాణీకుల సంఘం అధ్యక్షులు ఓఎ మల్లిక్ మాట్లాడుతూ మార్కాపురం - పెద్దదోర్నాల రైల్వేలైను కోసం గతంలో సర్వే కూడా జరిగిందని, నిధుల కేటాయింపే మిగిలిందని తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్ళే కొండవీడు ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక పర్యాయం మాత్రమే తిరుగుతుందని, దీనిని నిత్యం తిరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. గుంటూరు - హైదరాబాద్‌కు ఇంటర్‌సిటీ రైలు ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు జిఎంను కోరగా ఏ రైలు పెంచాలన్నా డబ్లింగ్ పనులు పూరె్తైతేనే సాధ్యమని తెలిపారు. కర్నూల్ - గుంటూరు మధ్య ఓ ప్రత్యేక రైలు నడిపేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా పలువురు నాయకులు కోరారు. మార్కాపురం మండల టిడిపి అధ్యక్షులు కాకర్ల శ్రీను మాట్లాడుతూ రైల్వేగేటు వద్ద అండర్ టనె్నల్ ఏర్పాటు చేస్తే ఆటోలు స్టేషన్ వచ్చేందుకు వీలుంటుందని కోరారు. అనంతరం ఆర్‌ఇఎస్ సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్స్‌ను, చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పార్కును ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమంలో డిఆర్‌యుసిసి సభ్యులు పైడిమర్రి శ్రీనివాసరావు, ఓఎ మల్లిక్, బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివి కృష్ణారావు, మహిళానేత పద్మా, కంభం ప్రయాణీకుల సంఘం అధ్యక్షులు బక్కిరెడ్డి, పలువురు బిజెపి నాయకులు, ఆర్‌కెజె నరసింహం, నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.