ప్రకాశం

డిసిసి బ్యాంకును లాభాల బాట పట్టిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జనవరి 22: పిడిసిసి బ్యాంకును లాభాల బాటలోకి తీసుకువస్తామని ఆ బ్యాంకు చైర్మన్ కండే శ్రీనివాసులు వెల్లడించారు. ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నూతనంగా ముద్రించిన 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ కండే శ్రీనివాసులు సోమవారం ఆయన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. పిడిసిసి బ్యాంకు చైర్మన్‌గా కండే శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా అసోసియేషన్ నాయకులు, బ్యాంకు ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కొన్ని కారణాల వలన బ్యాంకుకు లాభాలు తగ్గాయని, పూర్తిస్థాయిలో బ్యాంకును అభివృద్ధి చేసి లాభాల బాటలో పయనించే విధంగా అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. బ్యాంకు అభివృద్ధిలో ఉద్యోగులు పూర్తి అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. పాలక వర్గం విషయంలో పారదర్శకంగా ఉందని తెలిపారు. రానున్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో వందశాతం రుణాలు వసూలుచేయాలని ఉద్యోగులకు సూచించారు. బ్యాంకుకు లాభాలు వచ్చేలా ఉద్యోగులు పనిచేయాలని కోరారు. గత మూడు సంవత్సరాలుగా రుణాల వసూళ్లలో రాష్ట్రంలో పిడిసిసి బ్యాంకును మొదటి స్థానంలో నిలిపిన విధంగానే ఈ సంవత్సరం కూడా బ్యాంకును మొదటి స్థానంలో నిలపాలని ఉద్యోగులకు సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులకు, పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ రాజయ్య మాట్లాడుతూ చైర్మన్ సలహా మేరకు ఉద్యోగులు బ్యాంకు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో బ్యాంకు ఓఎస్‌డి కె చంద్రశేఖర్, బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ కె రాఘవయ్య, ఎస్సీ, ఎస్టీ యూనియన్ అధ్యక్షులు ఎం కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వై శేఖర్‌బాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు.