ప్రకాశం

సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జనవరి 22 : జిల్లాలోని యాదవులు, బిసిల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యాదవ మహాసభ నాయకులు బొట్లా రామారావు, జి వెంకయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్ లో 17 శాతానికి పైగా ఉన్న యాదవులకు అన్నీ విధాలుగా సహకారం అందించాలని కోరారు. యాదవ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 2500 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. తెలంగాణాలో మాదిరిగా 75 శాతం సబ్సిడీతో గొర్రెలు, మేకల యూనిట్ల ను మంజూరు చేయాలన్నారు. పశు కాపరులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీము ను ప్రవేశ పెట్టి పది లక్షల రూపాయలు వ్యక్తిగత భీమా చేయించాలన్నారు. ఒంగోలు లో యాదవ విద్యార్థులకు వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మానిఫెస్టోలో వాగ్థానం చేసిన హామీలను అమలు చేయాలన్నారు. టిటిడి బోర్డు చైర్మన్ గా యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలన్నారు. ఇప్పటికే 143 కులాలు ఉన్న బిసిల్లో ఇక మీదట ఏ ఒక్క ఆధిపత్య కులాన్ని బిసిల్లో చేర్చరాదని కోరారు. జిల్లాలో ఎయంసి చైర్మన్ పదవుల్లో కనీసం ఏడు బిసిలకు కేటాయించి మూడు యాదవులకు ఇవ్వాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వాసు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.