సబ్ ఫీచర్

ప్రయత్నం ఉండాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లంకాధిపతి రావణుడు. ముల్లోక వీరుడు. అందరినీ జయంచే వీరుడు. దేవతలుకూడా రావణుని ధాటికి తట్టుకోలేక గజగజలాడిపోతారు. వానరులు, మానవులు తప్ప మరెవ్వరి చేతిలోనుమరణం రాకూడదు అన్న వరం కోరుకున్నవాడు. కాని లంకారాజ్యంలో పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నాడు. అంటే
మానవ ప్రయత్నం చేసి తీరాలి. అపుడు దైవ బలం తోడవుతుంది. మనిషి తాను చేయవలసిన కర్తవ్యాన్ని చేయకోతే భగవంతుడు ఎదురుగా వచ్చి ఏ వరం ఇచ్చినా అది నిష్ప్రయోజనం అవుతుంది. చూడండి లంకారాజ్య పటిష్టత అక్కడ అసంఖ్యాకములైన రథాలు, అశ్వాలు, గజాలు ఇలా బహుళంగా సేన ఉంది. ఆ నగరానికి నలువైపులా ద్వారాలు రక్షకుల పాలనలో సురక్షితమై ఉన్నాయి. అవి విశాలంగా ఎత్తుగా ఉండడంవల్లే లంక శత్రు దుర్బేధ్యంగా ఉంది.
అంతేగాదు. అవి లోహ నిర్మితాలు; వాటిపై మంత్ర ప్రభావ యంత్రాలు ఉన్నాయి. అవి బాణాలను శిలలను వర్షిస్తాయి. వాటిచుట్టూ లోతైన అగడ్తలున్నాయి. వాటి దగ్గరే వందలకొద్ది రాక్షస గణం అస్తశ్రస్త్రాలు ధరించి అప్రమత్తులై కాపలా ఉన్నారు.
నగరం చుట్టూ ఉన్న ప్రాకారం బంగారంతో నిర్మితమైంది. మణులు రత్నాలు వైఢూర్యాలు పొదిగి ఉన్నాయి. ఆ ప్రాకారం ఎత్తుగాను దృఢతరంగా ఉంది. దానిని శత్రువులు ఎక్కలేరు. ఆ ప్రాకారం చుట్టూ ఉన్న అగడ్తలలో మొసళ్లు మత్స్యాలు చల్లని జలాల్లో తిరుగాడుతుంటాయి. కన్నులకింపుగా తామరలున్నాయి. కాని అవి శత్రు భయంకరాలు, ప్రమాదకరాలు. ఆ అగడ్తలనుండి ప్రాకారం లోపలకు యంత్ర సహాయంతో తెరచుకునే తలుపులున్న వంతెనలున్నాయి. ఆ ప్రాకార సమీపంలోనే సేవా నివాసాలున్నాయి. ఎవరైనా శత్రువులు ఆ వంతెనలపైకి వస్తే యంత్ర సహాయంతో వాటిని ఎత్తివేస్తారు. దాంతో ఆ వచ్చిన శత్రువులు అగడ్తల్లోని మొసళ్లకు ఆహారం అవుతారు. లంకలో అత్యున్నతస్థాయలో మేధావులున్నారు.
ఆ వంతెనలలో ఒక్క వంతెన చాలా దృఢతరమైంది. అభేధ్యమైంది. బంగారు స్తంభాలతో వేదికలతో నిర్మితమై ఉంది. శత్రువులు ఆ లంకపై దాడి చేయడం అసాధ్యం. నదులు, పర్వతాలు, వనాలు కృత్తిమాలైన అగడ్తలు, ప్రాకారాలు ఉన్నాయి. వీటిని దాటి వెళ్లడం దేవతలకు సైతం దుర్లభంగా కనిపిస్తుంది. రావణుడు యుద్ధ్భాలాషి. నిత్యం రణోత్సాహంతో ఆరోగ్య ధైర్యోత్సాహాలతో విలసిల్లుతుంటాడు. తన సేనల పర్యవేక్షణలో అతి జాగ్రత్తగా ఉంటాడు. లంక త్రికూట పర్వతంపైన కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థలో ఉంది.
శూలాలు, ఖడ్గాలు ధరించిన పదివేలమంది రక్కసులు పూర్వద్వారంలో, దుర్జయులైన లక్షలాది యోధులు దక్షిణ ద్వారంలో డాళ్లు, ఖడ్గాలు ధరించిన శూరులు పది లక్షలమంది పశ్చిమ ద్వారంలో అస్తశ్రస్త్రాల ప్రయోగాలలో ఆరితేరిన నిపుణులు కోట్లమంది ఉత్తరద్వారంలో చతురంగ బలాలతో నగరాన్ని రక్షిస్తుంటారు.
లంకలో భవనాలు, ప్రాసాదాలు, బంగారంతో నిర్మించి ఉన్నాయి. అగడ్తలు, శతఘు్నలు, యంత్రాలున్న లంక అమరావతిని తలపించే శోభతో పాటు శత్రు భయంకరంగా ఉంది. సద్వంశ సంజాతులు, హితులు, ఉత్తములైన వీరులు రావణునికి అండగా ఉన్నారు. లంకానగర మధ్య భాగాన్ని వేలకొలది రాక్షసులు నిరంతరం తమ అదుపాజ్ఞలలో ఉండే భటులతో రక్షిస్తుంటారు. ఆ అజేయులైన యోధుల సంఖ్య కోటిని మించి ఉంటుంది.
లంకావాసులు సిరిసంపదలతో తుల తూగుతున్నారు. వారిని ఎల్లపుడూ రావణుడు తన భద్రతా సిబ్బందితో కాపాడుతుంటాడు.

- ఆర్. పురంధర్