ప్రకాశం

అంగన్‌వాడీ కేంద్రాలు బలోపేతం కావాలి : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, ఫిబ్రవరి 16: ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అంగన్‌వాడీ కేంద్రాలు బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ అన్నారు. సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయాల ఆవరణలో శుక్రవారం జరిగిన రోటరీక్లబ్ ఆఫ్ మార్టూరు సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాలకు కుర్చీల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ నవీన్‌చంద్ పాల్గొన్నారు. అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నవీన్‌చంద్ పాల్గొని అంగన్‌వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను వివరించారు. సంపూర్ణ ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అంగన్‌వాడీ కేంద్రాలను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకర సమాజంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే యుక్త వయస్సు వచ్చిన కిశోర బాలికల నుండి అంగన్‌వాడీ సేవలు మొదలవుతాయన్నారు. బాల్య వివాహలను అడ్డుకుని సరైన వయస్సులోనే బాలికలకు వివాహలు జరిపించి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ఆరోగ్య కార్యకర్తలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. సరైన వయస్సులో వివాహంతో పాటు గర్భిణిగా, బాలింతగా ఉన్నప్పుడు తల్లీబిడ్డల సంరక్షణను అంగన్‌వాడీ కేంద్రాలు పర్యవేక్షిస్తూ ఉంటాయన్నారు. చిన్నారులకు బడి ఈడు వచ్చేంత వరకు ఐదు సంవత్సరాల వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపడం ద్వారా సరైన పౌష్టికాహరంతో పాటు అక్షర జ్ఞానం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో 300కు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 25శాతం కేంద్రాలకు మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ భవన నిర్మాణానికి మంజూరుచేస్తున్న రూ. 7.5 లక్షలు చాలకపోవడం వల్ల భవనాలు నిర్మించేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదని, ఆమొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు. అద్దంకి నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లాలోనే మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తనవంతు సహకారం అందిస్తానని కలెక్టర్ నవీన్‌చంద్ హామీ ఇచ్చారు. ఈమేరకు సంతమాగులూరు ఇన్‌చార్జి సర్పంచ్ కుంచాల వీరనారాయణ గ్రామంలోని 9 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ. 45వేల చెక్కులను, వెల్లలచెరువు సర్పంచ్ సూరె రామ్మోహనరావు రెండు కేంద్రాలకు రూ. 10వేలు అందజేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈకార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ నవీన్‌చంద్, ఒంగోలు ఆర్డీఓ కె శ్రీనివాసరావు, జిల్లా స్ర్తి శిశు సంక్షేమ అధికారి సరోజని, రోటరీక్లబ్ అధ్యక్షులు సురేంద్రకుమార్, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, సంతమాగులూరు సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్‌వైజర్ చసీదేవి, ఎంపీపీ సనె్నబొయిన ఏడుకొండలు, జడ్పీటీసీ దూపాటి మార్తమ్మ, తహశీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ శ్రీనివాసకుమార్, వెలుగు ఏపీఎం హనుమంతరావు, టీడీపీ నాయకులు ఓరుగంటి కోటిరెడ్డి, చింతా రామారావు, కారసాని వెంకటకోటిరెడ్డి, చేవూరి వాసురెడ్డి, ఆలూరి శ్రీనివాసరావు, ఏలూరి శ్రీనివాసరావు, జిర్రా విజయబాబు, బండి కోటిరెడ్డి, ముచ్చునూరి శ్రీనివాసరెడ్డి మండలమంలోని అన్ని గ్రామాల అంగన్‌వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.