ప్రకాశం

ఉల్లాసం..ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 16: వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన తొలిరోజు ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. ప్రధానంగా జగన్ పాదయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో జిల్లాలోని పార్టీశ్రేణులన్నీ ఆనందోత్సాలతో మునిగితేలుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా జగన్‌కు పార్టీశ్రేణులు,నాయకులు, ప్రజలు బ్రహ్మారధంపట్టారు. నెల్లూరు జిల్లానుండి ప్రకాశం జిల్లాలోని రాళ్ళపాడు వద్ద పార్టీనాయకులు,కార్యకర్తలు జగన్‌కు భారీస్వాగతం పలికారు. జగన్ పర్యటనను పూర్తిస్థాయిలో విజయవంతం చేయటంలో మాజీ మంత్రి,వైకాపా ఒంగోలుపార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజకీయ చతురతను చాటారు. గతంలో ఎన్నడూలేనివిధంగా భారీగా కార్యకర్తలు,నాయకులు తరలిరావటంతో బాలినేని వ్యూహాత్మాంగా వ్యవహరించటంతోనే జగన్‌కు అపూర్వమైన స్వాగతం లభించిందనే చెప్పవచ్చు. జగన్‌కు స్వాగతం పలుకుతూ కందుకూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీ తూమాటి మాధవరావు భారీఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఒక దశలో వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకపక్క, మరొకపక్క ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి నడకను సాగించటంతో పార్టీశ్రేణుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ప్రధానంగా తొలిసారిగా పాదయాత్రలో జిల్లాలో పాల్గొన్న జగన్ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. అన్నివర్గాలతో మాట్లాడుతూ ముందుకుసాగారు. ప్రధానంగా పాదయాత్రలో జిల్లాలోని సమస్యలపై ఆయన దృష్టిసారించినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. రాళ్లపాడు రైతుల సమస్యలను జగన్ సావధానంగా విన్నారు. అదేవిధంగా వరి రైతుల సమస్యలు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. కల్లుగీత కార్మికుడితో నవ్వుతూ జగన్‌మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకోవటంతో ఆవర్గంలో ఆనందం వ్యక్తవౌతుంది. బ్రాహ్మాణవర్గాలతోపాటు, ముస్లిం వర్గాలు సైతం జగన్‌కు బాసటగా నిలిచారు. ఆవర్గాలు సైతం వారివారి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో తమపార్టీ అధికారంలోకి రాగానే అన్నివర్గాలకు న్యాయం చేస్తానని ముక్తసరిగా సమాధానం ఇచ్చి వారిని సంతృప్తిపరిచారు. జగన్ పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుండి ఆయనతో సెల్‌ఫోన్లతో సెల్ఫీలు దిగేందుకు ఏగబడ్డారు. ఎలాంటి విసుగు చెందకుండా అందరికి సెల్పీలకు అవకాశం కల్పించారు. కొంతమంది మహిళలకు సెల్పీలు తీయటం చేతకాకపోతే ఆయనే స్వయంగా సెల్ఫీలు తీసి అందర్ని ఆకట్టుకున్నారు. సెల్పీలు దిగిన మహిళల ఆనందానికి అవధులు లేకుండా పోయాయనే చెప్పవచ్చు. 12వందల కిలోమీటర్ల పాదయాత్రను ముగించిన సందర్భంగా పార్టీశ్రేణులు ఆనందంగా ఉన్నాయి. జగన్‌పాదయాత్ర సందర్బంగా విభిన్న వేషదారులు ముందుగా నృత్యాలు చేస్తూ అందర్ని ఆకట్టుకున్నాయి. జగన్‌పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాపోలీసు యంత్రాంగం భారీగా పోలీసులను మోహరించింది. కాగా తొలిరోజున అన్నివర్గాలతో వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమకం కావటం పట్ల అన్నివర్గాల్లో హర్షం వ్యక్తవౌతుంది.
కాగా తనతండ్రి దివంగత రాష్టమ్రుఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లాలో పాదయాత్రను చేపట్టారు. ఆసమయంలోను వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జనాలు జేజేలు పలికారు. అదేస్ధాయిలో జిల్లాలో జగన్‌కు జననీరాజనాలు పలికారు. దీంతో రానున్న ఎన్నికల్లో తమపార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్న ధీమాలో వైకాపాశ్రేణులు ఆనందంలో మునిగితెలుతున్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డితోపాటు ఆయన పిఏ పరంధామరెడ్డి కూడా జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. మొత్తంమీద జగన్ పాదయాత్ర పూర్తిస్ధాయిలో విజయవంతం కావటంతో వైకాపా శ్రేణుల ఆనందం మిన్నంటుతుందనే చెప్పవచ్చు.