ప్రకాశం

ఎంట్రీ అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, ఫిబ్రవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలోకి ఎంట్రీ అదుర్స్ అనిపించింది. జగన్‌కు కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తూమాటి మాధవరావు ఘన స్వాగతం పలికారు. పురోహితుల వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో, భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో, పార్టీ జెండాలతో వేలాది మంది అభిమానులు జగన్‌కు జిల్లాలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యకారుల విన్యాసాలతో, నెమలి వేషగాళ్ల ఆటలు, మహంకాళి వేషధారణలు ఆకట్టుకున్నాయి. రాళ్లపాడు ప్రాజెక్టు పైనుంచి, భారీ భవనాలపైనుంచి, చెట్లమీద నుంచి అభిమానులు జగన్‌కు అభివాదం చేశారు. జగన్‌తో మాట్లాడేందుకు మహిళలు, మహిళా రైతు కూలీలు పెద్దఎత్తున బారులు తీరారు. పలువురు అభిమానులు జగన్ కటౌట్లను చేతపట్టి పాదయాత్రలో పాల్గొన్నారు. మరో అభిమాని తన ముఖంపై వైఎస్‌ఆర్ అని పెయింటింగ్ వేసుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రామకృష్ణాపురం వద్ద 1200 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మొక్కలు నాటారు. 89వ రోజు 13.3 కిలోమీటర్లు మేర జగన్ పాదయాత్ర నిర్వహించారు. జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలో జగన్‌ను చూసేందుకు వచ్చిన మహిళలను, వృద్ధులను, వికలాంగులను, మహిళా రైతు కూలీలను, కల్లుగీత కార్మికులను ఆప్యాయంగా పలుకరిస్తూ జగన్ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాళ్లపాడులోని నీరు సక్రమంగా అందక వరిపైరు ఎండిపోతోందని ఓరైతు జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్న నాయకులకు, అభిమానులకు తూమాటి మాధవరావు తాగునీరు, భోజన సదుపాయాలను కల్పించారు. ఈ ప్రజాసంకల్ప యాత్రలో ఎంపిలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఎ సురేష్, గౌతమ్‌రెడ్డితోపాటు వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు.
నేడు పాదయాత్ర సాగుతుందిలా...
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా 90వ రోజు శనివారం కందుకూరు నియోజకవర్గంలోని వివిపాలెం మండలంలో యాత్ర కొనసాగుతుంది. మండలంలోని గాంధీనగర్, వలేటివారిపాలెం, రోళ్లపాడు క్రాస్, పోలినేనిపాలెం క్రాస్, ఉప్పలపాడు క్రాస్, కూనిపాలెం క్రాస్, పోకూరు వరకు పాదయాత్ర జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ టి రఘురామ్ తెలిపారు.