ప్రకాశం

పాడి, మత్స్యపరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 20: వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సీపీఓ కాన్పరెన్స్ హాలులో మత్స్య, పశుసంవర్ధక శాఖల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వరస కరువు పరిస్ధితులు నెలకొన్నాయని, ఉత్సాహం ఉన్న పారిశ్రామికవేత్తలను పాడి పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సహించాలని అన్నారు. జిల్లాలో మత్స్య, పశుసంవర్ధక శాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని చెప్పారు. జిల్లాలో ప్రతి మండలంలో పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటుచేయాలని తెలిపారు. జిల్లాలో పశువులకు పశుగ్రాసం, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను నూరుశాతం సాధించి మంచి ఫలితాలు తీసుకురావాలని తెలిపారు. జిల్లాలో పశువుల హాస్టల్, మెగా పశుగ్రాస కేంద్రం ఏర్పాట్లు ప్రాథమిక దశలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మత్స్య, పాడిపరిశ్రమ రంగాల అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో పశుగ్రాసంకోసం అవసరమైన 15వేల మెట్రిక్ టన్నుల సైలేజ్ పశుగ్రాసం ఇస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ జిల్లాలో 56మండలాలను కరువుమండలాలుగా ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో పశుసంవర్ధక కళాశాలను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు పశువులను అందించేందుకు అవసరమైన రవాణా ఖర్చులు మంజరు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సోమశేఖర్, మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ సీతారామరాజు, జాయింట్ డైరెక్టర్ మార్కండేయులు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ బలరాం, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరక్టర్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.