ప్రకాశం

ప్రత్యేక హోదాను వదులుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 20: రాష్ట్రానికి ప్రత్యకహోదా అంశాన్ని తాము వదులుకోలేదని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పార్టీశ్రేణులకు స్పష్టం చేసారు. మంగళవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇవ్వలేదని ఆనాడు 14వ ఫైనాన్స్ కమీషన్ చెప్పిందని, ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక సహాయం కూడా అరకొరగానే కేంద్రం విడుదల చేస్తోందని చెప్పారు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా విషయంలో స్వార్థపూరిత రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ జిల్లా తెలుగుదేశంపార్టీ ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని వివరించారు. ఈ విషయం తరువాత మాట్లాడుదామని సీఎం ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, పార్టీ రాష్ట్ర నాయకుడు యర్రాకుల శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.