ప్రకాశం

విజయవాడకు తరలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 25:వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ఈనెల 27వతేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండుగంటలలోపు పార్టీలో చేరుతున్నారని అందువలన జిల్లాలోని ముఖ్యనాయకులందరు విజయవాడకు తరలిరావాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్రఅధ్యక్షుడు కళా వెంకట్రావు ఆహ్వానం పలికారు. సోమవారం రాత్రి జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయం కమిటీ సమావేశం జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా గొట్టిపాటి పార్టీ చేరికపై రాష్టప్రార్టీ అధ్యక్షుడు అందరినాయకులతో మాట్లాడారు. దీంతో గొట్టిపాటి పార్టీచేరికపై అధినాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లైంది. ఎప్పటినుండో గొట్టిపాటి వైకాపాను వీడి తెలుగుదేశంపార్టీలోచేరుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది.
ఈసమావేశంలో జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో నేతలు చర్చించారు. జిల్లాలోని పశ్చిమప్రాంతంలో నెలకొన్న మంచినీటి ఎద్దడిని నివారించేందుకు బోర్లను వేసేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశం చర్చించింది. అదేవిధంగా ఆర్‌డబ్ల్యుఎస్ పెండింగ్ పనులను వెంటనే చేయాలని, అంగన్‌వాడీ సభ్యత్వనమోదుపై ప్రత్యేక దృష్టిసారించాలని సమావేశంలోనేతలు పార్టీనాయకులకు సూచించారు. అదేవిధంగా జిల్లాలో ప్రధానంగా సుబాబుల్, జామాయిల్, పొగాకు రైతులకు గిట్టుబాటుధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని అందువలన అధికారులు, ప్రజాప్రతినిధులతో రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని నేతలు తీర్మానించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు,రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దారాఘవరావు, పర్చూరు, చీరాల, యర్రగొండపాలెం, కొండపి శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, పాలపర్తిడేవిడ్‌రాజు, ఆయా నియోజకవర్గాలకుచెందిన ఇన్‌చార్జులు దివిశివరాం, అన్నా రాంబాబు, బిఎన్ విజయకుమార్‌తోపాటు పార్టీముఖ్యనాయకులు పాల్గొన్నారు.

ఒకరికొకరు!
మూడుముళ్లతో ఒక్కటైన వికలాంగులు!
చీరాల, ఏప్రిల్ 25 : కాళ్లు లేకున్నా కలసి జీవించాలనుకున్నారు.. ఒకరి సాయంతో ఒకరు ఏడడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రేమించుకున్న ఇద్దరు వికలాంగులు దేవుని సన్నిధిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హృదయాన్ని కదిలించే ఈ సంఘటనకు స్థానిక వీరరాఘవస్వామి గుడి వేదికైంది. నరసరావుపేటకు చెందిన బుర్లా గంగారామ్ ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి చిన్నతనం నుంచి అంగవైకల్యం కలదు. ఇతనికి చీరాలకు చెందిన మల్లవరపు తులసితో మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం వుంది. అయితే తులసికి కూడా అంగవైకల్యం కలదు. అయినప్పటికీ మూడేళ్ల తమ ప్రేమను పెళ్లిగా మలచుకోవాలనుకున్నారు. దీంతో స్థానిక వీరరాఘవస్వామి గుడిలో కుటుంబ సభ్యులు సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు.
పిడుగుపాటుకు
60 గొర్రెలు మృతి
పుల్లలచెరువు, ఏప్రిల్ 25: మండలంలోని నరజాముల తాండలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు రామావత్ బాలునాయక్, చంద్రనాయక్, బాగోజినాయక్‌కు చెందిన 60 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. వీటి విలువ సుమారు 5లక్షల రూపాయలు ఉంటుందని బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎఎస్సై నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని గొర్రెలను పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.