క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదాల్లో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల,మార్చి 16:జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారులపై కొరిశపాడు మండల పరిధిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయాలుపాలైన సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయరహదారిపై బొడ్డువానిపాలెం గ్రామ బస్టాండు సమీపంలో పార్సిల్ లారీ వెనుకనుండి ఢీకొనగా మోటారుసైకిలిస్టు మృతిచెందాడు. ముండ్లమూరు మండలం బొట్లపల్లి గ్రామానికి చెందిన అమృతపూడి లక్ష్మయ్య గుండ్లాపల్లి గ్రోత్‌సెంటరులోని ఒక ప్యాక్టరీలో సెక్యూరిటి గార్డుగా పనిచేస్తుంటాడు. గురువారం రాత్రి విధి నిర్వహణకై గుండ్లాపల్లి వెళ్లి శుక్రవారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరాడు. ఈక్రమంలో చెన్నైనుండి లక్నోకు వెళ్తున్న పార్సిల్‌లారీ బొడ్డువానిపాలెం బస్టాండు సెంటరులో ఉదయం ఆరుగంటల ప్రాంతంలో లక్ష్మయ్య మోటారుసైకిల్‌ను వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య (52)బైకుపైనుండి ఏగిరి డివైడైర్‌పైడి తలకు తీవ్రగాయాలుపాలై సంఘటన స్ధలంలోనే మృతిచెందాడు. పార్సిల్ లారీ డ్రైవరు లారీని ఆపకుండా పరారుఅవుతుండటంతో స్థానికులు వెంబడించి డ్రైవరును అదుపులోకి తీసుకుని మేదరమెట్ల పోలీసులకు కబురు అందించారు. మరోకప్రమాదంలో శింగరాయకొండకు చెందిన పాదర్తి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో విదేశాల నుండి వస్తున్న తన అత్తమామలను రిసీవ్‌చేసుకునేందుకు హైదరాబాద్ వెళ్లారు. గురువారం రాత్రి అత్తమామలు ఒక వాహనంలో శ్రీనివాసరావు దంపతులు మరొకవాహనంలో శింగరాయకొండకు బయలుదేరారు. ఈక్రమంలో కొరిశపాడు గ్రామ ప్లైఒవర్ వద్ద ముందు వెళ్తున్న ఐషర్ వాహనాన్ని శ్రీనివాసరావు వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. ఈప్రమాదంలో డ్రైవర్‌తోపాటు శ్రీనివాసరావు, అతని కుమార్తె గాయాలుపాలైనారు.ప్రమాదవార్త తెలుసుకున్న మేదరమెట్ల ఎస్‌ఐ వై పాండురంగారావు క్షతగాత్రులను ఒంగోలు లోని ఒకప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బొడ్డువారిపాలెం వద్ద మృతిచెందిన లక్ష్మయ్య మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి రెండు ప్రమాద కేసులను దర్యాప్తుచేస్తున్నారు.