క్రైమ్/లీగల్

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మార్చి 19: దుర్వ్యసనాలకు బానిసై భార్యపై అనుమానంతో భర్త హత్య చేసిన సంఘటన ఈనెల 3వ తేదీన మార్కాపురం పట్టణ పోలీసుస్టేషన్‌లో చోటుచేసుకోగా, ఆ కేసులో నిందితుడైన పారుమంచాల చిన్నక్రిష్ణయ్యను సోమవారం మార్కాపురం సిఐ భీమానాయక్ ఆధ్వర్యంలో అరెస్టుచేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలలో సిఐ భీమానాయక్ మాట్లాడుతూ చిన్నక్రిష్ణయ్య మద్యం, గంజాయికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈనేపథ్యంలో గతంలో రెండుమూడు పర్యాయాలు భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించగా, చుట్టుపక్కలవారు అడ్డుకొని తప్పించారు. అయితే ఈనెల 3వ తేదీ మధ్యాహ్నం సమయంలో గుండ్లకమ్మ నదిఒడ్డున గడ్డికోసేందుకు భార్య చిన్నరంగమ్మను పొలానికి తీసుకువెళ్ళి గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేసి అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కాగా, తల్లిని చంపిన విషయం తెలుసుకున్న తనయుడు కోటేశ్వరరావు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించడంతో నాటి నుంచి మార్కాపురం ఏరియా వైద్యశాలలో చిన్నక్రిష్ణయ్య చికిత్స పొందాడు. కాగా, డాక్టర్లు సోమవారం అతన్ని డిశ్ఛార్జి చేయడంతో అరెస్టుచేసి రిమాండ్‌కు పంపినట్లు సిఐ భీమానాయక్ తెలిపారు.

మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు
యద్దనపూడి, మార్చి 19: మండలంలోని పూనూరు గ్రామంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని యద్దనపూడి పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్సై ఏ నాగేశ్వరరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు పూనూరు గ్రామానికి చెందిన ఎం సీమోన్ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తన పట్ల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి సోమవారం పర్చూరు కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు.