ప్రకాశం

పెద్దారవీడు మండలంలో గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దారవీడు, ఏప్రిల్ 20: గతవారంరోజులుగా తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రత పెరగడంతో తల్లడిల్లుతున్న ప్రజానీకానికి శుక్రవారం కురిసిన గాలివానతో వాతావరణం చల్లబడింది. మండలంలోని కుంట, పెద్దారవీడు, తోకపల్లి, దేవరాజుగట్టు, గొబ్బూరు, ఓబులక్కపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దీనితో రేకుల షెడ్లు, పశువులపాకలు, వ్యాపార బంకులు పడిపోయి నష్టం వాటిల్లింది. ఉష్ణోగ్రత 40 దాటడంతో మధ్యాహ్న సమయంలో చిన్నపిల్లలు, వృద్దులు తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. అయితే ఒక్కసారిగా ఒక మోస్తరు వర్షం కురవడంతో సేదతీరారు. గాలివాన భీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు ఒరిగినట్లు పలుగ్రామాల ప్రజలు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.