ప్రకాశం

నేటి నుంచి వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, ఏప్రిల్ 22: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను ఈనెల 23 నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వక్కలగడ్డ సత్యవెంకటమల్లికార్జునరావు తెలిపారు. దేవస్థానంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని ఆర్యవైశ్యుల సహకారంతో 2కోట్ల రూపాయల ఖర్చుతో ఆరుకిలోల బంగారు చీరెను వాసవీ అమ్మవారి కోసం తయారు చేయించినట్లు, చీరె అలంకరణ కార్యక్రమాన్ని 25వ తేదీన ఉత్సవంలా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యశ్రేష్ఠి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి బంగారుచీరె సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 25వ తేదీ మధ్యాహ్నం పెద్దఎత్తున అన్నప్రసాద వినియోగం కార్యక్రమం జరుగుతుందని, రాత్రి 8గంటలకు గజవాహనంపై వాసవీ అమ్మవారి నగరోత్సవం జరుగుతుందని అన్నారు. ఆర్యవైశ్యులందరూ బుధవారం వాణిజ్య సముదాయాలను పూర్తిగా మూసివేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి పాదర్తి వెంకటనారాయణ, కోశాధికారి బొంతల వెంకటసుధీర్‌కుమార్, ఎల్ శ్రీనివాస్, పాదర్తి శంకర్, గొంట్ల శ్రీధర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.