ప్రకాశం

పోకూరు చెరువుకు రాళ్లపాడు ప్రాజెక్టు నీరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలేటివారిపాలెం, మే 17 : పోకూరు చెరువుకు రాళ్లపాడు నీరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం మండలంలోని పోకూరుకు నీరు- ప్రగతి కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబు మాట్లాడుతూ పోకూరు చెరువు 1000 ఎకరాలలో నిర్మించారని, సుమారు 1200 ఎకరాల ఆయకట్టు ఉందని అందుకే ఈ చెరువు పూడిక తీతకు ఇతర అభివృద్ధి పనులకు 35 లక్షలు మంజూరు చేశామని అన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆధునికీకరణకు 45 కోట్లు ఇదివరలోనే మంజూరుచేశారని మరో 6కోట్ల 30 లక్షలు వ్యయంతో పైపులైన్ ఏర్పాటు చేస్తే పోకూరు చెరువుకు రెండు పంటలు వేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ముందుగా చంద్రబాబు జెసిబి యంత్రంతో చెరువులో పూడిక తీత పనులు ప్రారంభించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 600 మీటర్ల దూరంలో సోమశిల కాలువ నిలిచిందని మరో నెల రోజుల్లో రెండు పంటలకు నీరిస్తామని అన్నారు. పోకూరు చెరువుకు రాళ్లపాడు నీరిస్తామని సంవత్సరానికి రెండు పంటలు పండే విధంగా చేస్తామని హామీఇచ్చారు. అంతేగాక నేకునాంపురానికి కూడా అందేలా చూస్తామని అన్నారు. వర్షాలు తక్కువగా పడినప్పటికి 3.85 శాతం భూగర్భజలాలను పైకి తెచ్చిన ఘనత మన ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, శిద్దా రాఘవరావు, నారాయణ, కలెక్టర్ వినయ్‌చంద్, ఎమ్మెల్యేలు పోతుల రామారావు, దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజు, స్వామి, ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎంపి శ్రీరామ్ మాల్యాద్రి, ఎం ఎల్‌సిలు కరణం బలరామ్, మాగుంట శ్రీనివాసుల రెడ్డి , జూపూడి ప్రభాకర్ రావు, దివి శివరామ్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, యువ నాయకులు కరణం వెంకటేష్, శిద్దా సుధీర్, దామచర్ల సత్య, జడ్పీటీసిలు గట్టమనేని సుబ్బారావు,కంచర్ల శ్రీకాంత్, ఎరిక్షన్ బాబు, పోకూరు సర్పంచ్ గట్టమనేని వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి తానికొండ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ పాత, కొత్త హామీలు కురిపించిన చంద్రబాబు
* రామాయపట్నం పోర్టు నిర్మాణానికి
అన్ని ప్రయత్నాలు చేస్తాం
* నాగులుప్పలపాడులో మైనింగ్
యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం
* డిసెంబర్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరందిస్తాం
* ముఖ్యమంత్రి చంద్రబాబు హామీల వర్షం
ఒంగోలు, మే 17 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మళ్లీ పాత, కొత్తహామీల వర్షం కురిపించారు. గతంలో మేజర్‌గా కురిపించిన హామీల వర్షం ఒక్కటి కూడా కార్యరూపం దాల్చకముందే మళ్లీ హామీల వర్షం కురిపించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం, కందుకూరులలో జరిగిన బహిరంగ సభ, రచ్చబండ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాపై హామీల వర్షం కురిపించారు. జిల్లాలోని రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. దీంతో పోర్టు ఏర్పాటుపై కదలికలు వచ్చినట్లయింది. నాగులుప్పలపాడులో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గతంలోను జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. పామూరు మండలం దుబగుంటలో ట్రిపుల్ ఐటీ పనులు ప్రారంభిస్తామన్నారు. కనిగిరిలో నిమ్జ్ ఏర్పాటు, జిల్లాలో వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్శిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. రాళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేసి రైతులకు నీటి కష్టాలు తీరుస్తామని ప్రకటించారు. నదుల అనుసంధానం ద్వారా రైతులకు నీరు అందిస్తామని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి రెండు టనె్నల్స్‌ను పూర్తి చేయాల్సి ఉందని, టెండర్లు పిలిచి డిసెంబర్ నాటికి పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనె్నల్ ద్వారా నీటిని ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. రాళ్లపాడు ఎడమ కాలువ నుంచి శాఖవరం ద్వారా పోకూరు చెరువుకు ఐదు కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నీటిని తీసుకొచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా నేకునాంపురం చెరువుకు కూడా నీటిని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం తమదేనని తెలిపారు. కాగా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనవాహిని ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. నాకు అండగా నిలవండి, తోడుగా ఉండండి, మీ కోసం ఏదైనా చేస్తా అంటూ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రసంగించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు పొంగూరు నారాయణ, శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కరణం బలరాం, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్‌లతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.