క్రైమ్/లీగల్

పార్థీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న ఇద్దరు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 19: జిల్లాలో పార్థీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సోషల్‌మీడియాలో అస్యత్య ప్రకటనలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఒంగోలు పట్టణ డిఎస్‌పి బి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్థానిక కొత్తపట్నం బస్టాండ్ సెంటర్‌లోని డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కొండపి మండలం, మిట్టపాలెం గ్రామానికి చెందిన చింతగుంట్ల వినోద్, సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన నాయుడు జలరామ్ ఉన్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను డిఎస్‌పి శ్రీనివాసరావు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పార్థీ గ్యాంగ్ గురించి విస్తృతంగా తప్పుడు ప్రచారం చేసి ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరు వ్యక్తులను సింగరాయకొండ పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసత్య ప్రచారాలను చేసి ప్రజలను భయాలకు గురిచేసే విషయాలను పోస్టు చేస్తే వాటికి గ్రూపు అడ్మిన్ మీద, పోస్టుచేసిన వారిని బాధ్యత వహిస్తూ వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి తెలిపారు. ప్రజలకు ఎవరిమీద అయినా అనుమానం కలిగితే వెంటనే సంబంధిత పోలీసుస్టేషన్‌కు లేదా డైయల్ 100కు తెలియజేయాల్సిందిగా డిఎస్‌పి కోరారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్లైయితే అలాంటి వ్యక్తుల మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పార్థీ గ్యాంగ్ గురించి లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోస్టులను ప్రచారం చేసే వ్యక్తుల మీద పోలీసు నిఘా పెట్టినట్లు చెప్పారు. అపోహలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిని అరికట్టేందుకు ఎస్‌పి సత్యఏసుబాబు చేపడుతున్న కార్యాచరణలో భాగంగా తన ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం సమయంలో సింగరాయకొండ సమీపంలో సింగరాయకొండ సీఐ దేవప్రభాకర్, సింగరాయకొండ ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

కర్నాటకలో బీజేపీకి చెంపదెబ్బ
ఒంగోలు, మే 19:కర్నాటకలో జరిగిన ఎన్నికలు బిజెపికి చెంపదెబ్బఅని మతతత్వపార్టీకి ప్రజలు బుద్దిచెప్పారని ఆల్ ఇండియా ఎస్‌సి,ఎస్‌టి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి మోజెస్ అన్నారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం జిల్లాపార్టీకార్యాలయంలో సమావేశంనిర్వహించారు. ఈసమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు మధు, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.