ప్రకాశం

గవర్నర్ వ్యవస్థనే నిర్వీర్యం చేసిన బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 19: కర్నాటకలో గవర్నర్ వ్యవస్థనే బీజేపీ నేతలు నిర్వీర్యం చేశారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దనరావు శనివారం ఒక ప్రకటనలో ధ్వజమేత్తారు. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోయినప్పటికీ అధికారం చేజిక్కించుకోవాలని మోడి, అమిత్ షాలు అనైతిక చర్యలకు పాల్పడి రాజ్యాంగ వ్యవస్థల ద్వారా గనుల మాఫియా డాన్ అయిన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులతో బేరసారాలాడించి గవర్నర్ వ్యవస్థ ద్వారా అధికారం కోసం మేజిక్ ఫిగర్ లేక పోయినప్పటికీ దొడ్డిదారిలో ఎమ్మెల్యేలను కొని ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించేందుకు మోదీ, అమిత్‌షాలు పూనుకోవడం అత్యంత నీచమైన చర్యని ఆయన విమర్శించారు. అంతే కాకుండా దక్షిణాది కర్నాటకలో మేమే గెలుపొందుతామని , అనంతరం ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తామని వారి నాయకులు అత్యుత్సాహంతో ప్రగల్బాలు పలకడం , మోడి ప్రభుత్వం విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన వాగ్దానాలను మరచిపోయి తన కుటిల రాజనీతితో ఎ 1, ఎ 2 ముద్దాయి లైన వైయస్ ఆర్ పార్టీ నాయకులను దగ్గర చేర్చుకొని ఆంధ్రప్రదేశ్ ను దెబ్బతీసే ప్రయత్నంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కి చేసిన మోసాన్ని అక్కడి తెలుగు ప్రజలకు తెలియజేయటం వలనే వారు బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి బీజేపీ నాయకులు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. చివరకు కర్నాటకలో ఇతర శాసనసభ్యులు బిజెపి ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.