ప్రకాశం

పర్యావరణ పరిరక్షణకు సమష్టి కృషి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు
ఒంగోలు,మే 19: పర్యావరణ పరిరక్షణకు మనమందరం కలిసికట్టుగా కృషిచేయాలని అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఎన్‌టిఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్టస్థ్రాయి అటవీశాఖాధికారుల సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోనే సకాలంలో వర్షాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22.65శాతం భౌగోళికప్రాంతంలో అటవీ విస్తీర్ణం ఉందన్నారు. 2029నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని 50శాతం పెంచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. వనం-మనం కార్యక్రమంలో ఈ సంవత్సరం రెండుకోట్ల మొక్కలు నాటామన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 50కోట్లమొక్కలు నాటినట్లు చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సక్రమంగా సంరక్షించే బాధ్యత అందరం తీసుకునే విధంగా ప్రతిజ్ఞ చేయాలన్నారు. అటవీశాఖాధికారులు మొక్కల సంరక్షణ, పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో ప్రజలతో ర్యాలీలు, సెమినార్లు, అవగాహన కార్యక్రమాలను విస్తత్రంగా చేపట్టాలన్నారు. అదేవిధంగా పరిశ్రమలు, స్వచ్ఛందసంస్థలను భాగస్వామ్యం చేయాలన్నారు. అడవుల్లో భూగర్భజలాల పెంపుదల కోసం 500కోట్లరూపాయల అంచనాలతో పనులు చేపట్టనున్నామని మంత్రి తెలిపారు. అడవుల్లో పశువులకు, వన్యప్రాణులకు తాగునీటి నిల్వలు ఏర్పాటుచేయాలన్నారు. ప్రముఖ దేవాలయాలు ఉన్నప్రాంతాల్లో ఏకో టూరిజాన్ని అభివృద్దిచేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అటవీశాఖాధికారులను ఆదేశించారు. నర్సరీల అన్నింటిని వనమిత్రగా మార్పుచేసి అక్కడి ప్రజలకు అన్నిరకాల వసతులు కల్పించేలా చూడాలన్నారు. రాష్ట్రంలో నగర వనాలు, ఏకో టూరిజం స్పాట్లు, జంతుప్రదర్శనశాలలను అభివృద్దిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలకు అవసరమైతే టిటిడి నుండి నిధులు అందేలా చూస్తామన్నారు. అమరావతిలో కూడా జంతుప్రదర్శనశాలను తీసుకురావాలని అందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టును తయారుచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో పచ్చదనం, ఏకో టూరిజం ప్రాజెక్టులు, సైన్స్ సిటీలు, మ్యూజియంలను అభివృద్ధి చేయాలని అప్పుడే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. మంచి టూరింగ్ స్పాట్స్‌ను అమరావతిలో ఏర్పాటుచేయాలన్నారు. అధికారులందరు సమష్టిగా బాధ్యతగా పనిచేసి అటవీశాఖకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఎర్రచందనం వేలం ద్వారా సుమారు 110కోట్లరూపాయలు వచ్చిందన్నారు. చెక్‌పోస్టులను పటిష్టపర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అడవుల సంరక్షణలో భాగంగా బేస్ శిబిరాలు, చెక్‌పోస్టులు, స్ట్రకింగ్ బలగాల పనితీరు మెరుగుపర్చేలా చూడాలన్నారు. బేస్ క్యాంపుల నిర్వహణకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలకు 50లక్షల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. జలసంరక్షణ ఉద్యమం జూన్ నెలాఖరు వరకు నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఏకో టూరిజం కింద జిల్లాలోని భైరవకోనను అభివృద్దిపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. షెల్టర్ బెల్ట్స్‌ను మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పచ్చదానానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటేకార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టాలని, అటవీశాఖాధికారులు, పోలీసులు సమీష్టిగా పనిచేయాలన్నారు. ఎర్రచందనం సంక్షరణ గోదాములను పరిశీలించటం జరిగిందని, పలుచోట్ల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. వివిధ గ్రేడ్‌ల్లో ఎర్రచందనాన్ని ప్రత్యేకంగా వివిధ షెడ్లల్లో ఉంచాలని అధికారులకు సూచించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణాచేసేవారిపై కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుందని, ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. అటవీసంపదను కాపాడేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. నీరు -చెట్టు కార్యక్రమం ద్వారా కందకాలు, పెర్కూలేషన్ ట్యాంకులు, చెక్‌డ్యాంలు చేపట్టాలన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా ప్రొక్లెయిన్లు కొనుగోలు చేయాలని సూచించటం జరిగిందన్నారు. భవిష్యత్‌లో ప్రతి మూడునెలలకొకసారి రాష్టస్థ్రాయి సదస్సులు నిర్వహించుకుని సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని అటవీశాఖలో మంచి ఫలితాలు సాధించాలని మంత్రి అధికారులకు సూచించారు. అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ అధికారులు తమ సర్కిల్ పరిధిలో చేపడుతున్న కార్యకలపాలపై పవర్‌పాయింట్ ద్వారా మంత్రికి వివరించారు. అటవీశాఖకు సంబంధించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ముందుగా రాష్టస్థ్రాయి అధికారుల సదస్సును మంత్రి శిద్దా రాఘవరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసదస్సులో రాష్ట్రఅటవీశాఖాధిపతి పి మల్లికార్జునరావు, సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారు కజూరియా, ఐఎఫ్‌ఎస్ అధికారిణి రేవతి, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్‌ఒలు, సోషల్ ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.