ప్రకాశం

అవినీతిని నిరూపిస్తే గడియార స్తంభానికి ఉరివేసుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మే 20: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో తాను అవినీతికి పాల్పడుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరైనా నేరుగా వచ్చి నిరూపిస్తే సెంటర్‌లో ఉన్న గడియార స్తంభానికి ఉరి వేసుకుంటానని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం నాయుడువీధిలో జరిగిన సభలో కందుల నారాయణరెడ్డి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. నేను నియోజకవర్గంలో ఏ ఒక్కరివద్ద ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లుకానీ, తీసుకున్నట్లుకానీ నిరూపిస్తే బహిరంగ ఆత్మహత్యకు సిద్ధమని తెలిపారు. నియోజకవర్గంలో అసమ్మతి ఉందని ప్రచారం జరుగుతోందని, అవి చిన్నచిన్నవేనని, వారితోకలిసి చర్చించి పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తాను అధికారంలో లేకున్నా మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకువెళ్ళి అభివృద్ధిపనులు చేసేందుకు కష్టపడుతున్నానని అన్నారు. ప్రజలకు చేరువలో ఉండి పనులు చేసేవారిని కాదని, ప్రజలకు అందుబాటులో ఉండని నేతలను మంచిగా చెప్పడం ఎంతవరకని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం నియోజకవర్గంలో సమస్యలు తీరాలంటే ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తికావాలని, అప్పుడే సాగు, తాగునీరు అంది రైతులు సంతోషంగా ఉంటారని తెలిపారు. అలాగే మార్కాపురంలో ఉన్న ఏరియా వైద్యశాలను జిల్లా ఆరోగ్యకేంద్రంగా మార్చాలని గతంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని, ఒంగోలులో రిమ్స్ వైద్యశాలను ఏర్పాటు చేయడం వలన ఆ జిల్లా వైద్యశాలను మార్కాపురానికి తరలించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ అయ్యాయని అన్నారు. నాలుగేళ్ళుగా వర్షాలు లేవని చంద్రబాబు పాలనే కారణమని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసి మార్కాపురం నియోజకవర్గంలో కురవలేదంటే అందుకు ఎవరు బాధ్యులో ప్రజలు గుర్తెరగాలని, తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో పుష్కలంగా వర్షాలు కురిసి కరవు లేదని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మార్కాపురం ప్రాంతాన్ని కరువుప్రాంతంగా గుర్తించి రైతులకు రుణమాఫీ చేయాలని మంత్రి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 90గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని, నిత్యం 1300 ట్రిప్‌లను సరఫరా చేసి తాగునీటి సమస్యను తీరుస్తున్నామని, ఇందుకోసం అధిక నిధులు మంజూరు చేయించేందుకు మంత్రి, ఎంఎల్‌సిలు సిఎం ద్వారా కృషి చేయాలని కోరారు.
నేటి నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభమైంది
మినీ మహానాడు నిర్వహణ నుంచే మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం ప్రారంభమైందని, గత 18 రోజులుగా నియోజకవర్గంలో 345 కిలోమీటర్లు సైకిల్‌యాత్ర పూర్తి చేశామని తెలిపారు. రేపటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ నిత్యం ఏదొక గ్రామంలో పర్యటిస్తూ వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో 84శాతం ప్రజలు తెలుగుదేశంపార్టీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఇటీవల వెల్లడైన ఒక సర్వేలో తేలిందని, కార్యకర్తలు కూడా కార్యోన్ముఖులై ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచారాన్ని ప్రారంభించాలని, వైసిపి నేతలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా టిడిపి వాణిజ్యవిభాగం అధ్యక్షులు వక్కలగడ్డ మల్లికార్జున్, ట్రస్టుబోర్డు చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం, మున్సిపల్ మాజీచైర్మన్ షేక్ షెక్షావలి, ఎఎంసి మాజీచైర్మన్ డివి కృష్ణారెడ్డి, టిడిపి పట్టణపార్టీ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్ళపల్లి సత్యనారాయణ, ఆదాంసాహెబ్, ఎఎంసి మాజీవైస్‌చైర్మన్ కాకర్ల శ్రీను, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గునుపుడి భాస్కర్, పిఎల్‌పి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.