ప్రకాశం

కర్ణాటకలో బీజేపీకి తెలుగువారు గట్టి బుద్ధి చెప్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మే 20: మోడి, షాల ధ్వయం దేశంలో రాక్షస పాలన సాగిస్తున్నారని, తెలుగువారికి అన్యాయం చేసిన విషయాన్ని గమనించిన కర్ణాటకలోని తెలుగువారు సరైన సమాధానం చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సైకిల్‌యాత్ర ముగింపు సందర్భంగా నాయుడువీధిలో జరిగిన మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈకార్యక్రమానికి జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా మంత్రి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో విభజన జరిగి కష్టాల్లో ఉండి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బిజెపితో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తే చంద్రబాబును మోసం చేశారని అన్నారు. మూడేళ్ళ తరువాత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అర్థరాత్రి సమావేశం నిర్వహించి 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రత్యేకహోదా ఇవ్వలేకపోతున్నామని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి, నాలుగు, ఐదు బడ్జెట్‌లలో ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ఎన్‌డిఎ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యమంత్రి 29 సార్లు అపాయింట్‌మెంటు అడిగితే ఇవ్వని ప్రధాని మోడి ఆర్థిక నేరాలకు పాల్పడి 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డికి, రెండవ ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డిలకు అపాయింట్‌మెంటు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం పాటుపడుతున్నానని చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి ఏనాడూ బిజెపిపై ఒక్కమాట కూడా మాట్లాడడని, అలాగే బిజెపివారు కూడా జగన్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటారని అన్నారు. ప్రత్యేకహోదా కోసం టిడిపి ఎంపిలు ప్రధాని ఇంటిని ముట్టడించడమేకాక పార్లమెంటులో నిరసనలు వ్యక్తంచేసి దేశంలోనే పేరు సంపాదించారని, వైసిపి ఎంపిలు మాత్రం రాజీనామాలు చేసి ఆమోదించుకోకుండా నాటకం ఆడుతున్నారని అన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, అలాంటి సంఘటనలకు ఎవరైనా సిద్ధం అయితే పక్కరైతులు వారికి ధైర్యంచెప్పి బ్యాంకుల ద్వారాకానీ, ప్రభుత్వం నుంచికానీ రుణాలు ఇప్పించి కుటుంబాలు వీధిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్రలో ముద్దులు తప్పా సమస్యలు తెలుసుకోవడం లేదని, ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబును, తెలుగుదేశాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని వైసిపి నేత జగన్ పాదయాత్ర చేపడుతున్నారని అన్నారు. అభివృద్ధి జరిగితే ప్రజలు తనను మరచిపోతారనే భయంతో నిత్యం అభివృద్ధి ఆటంకుడిగామారి ప్రవర్తిస్తున్నాడని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు రుణమాఫీ, వ్యవసాయ రంగానికి 7గంటల విద్యుత్, మహిళలకు పసుపుకుంకుమ, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 1000 రూపాయల పెన్షన్ చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. తనకు అధికారం కట్టపెడితే పెన్షన్లను 1000 నుంచి 2వేలు లేదా 3వేలకు పెంచుతానని ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు. రైతుసంక్షేమం కోసం మిర్చికి ధరలేక అల్లాడుతుంటే రైతులను ఆదుకోవాలనే ధ్యేయంతో క్వింటాకు 1500 రూపాయలు అదనంగా ఇచ్చిన ఘనత టిడిపిదేనని అన్నారు. ఇందుకోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. పసుపు ధరలేక అల్లాడుతూ రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే 6వేల రూపాయలకు కొనుగోలు చేయాల్సిన పసుపును 6500కు కొనుగోలుచేసి రైతులను ఆదుకోవడం జరిగిందని అన్నారు. ఎంఎల్‌సి కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉందని, టిడిపి హయాంలోనే శంకుస్థాపన చేశామని, ప్రారంభోత్సవం కూడా బాబు చేతుల మీదుగా జరుగుతుందని అన్నారు. జిల్లాలో రామతీర్థం, గుండ్లకమ్మ లాంటి ప్రాజెక్టులను పూర్తిచేసిన ఘనత కూడా టిడిపిదేనని అన్నారు. శాలీవాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ టిడిపి హయాంలోనే బిసి, ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత నందమూరి తారక రామారావుదేనని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.