ప్రకాశం

వ్యవసాయంలో రాజకీయ ప్రమేయం ఉండరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకొల్లు, మే 20: వ్యవసాయ రంగంలో రాజకీయాలకు తావివ్వరాదని రైతులందరూ సంఘటితంగా ఉండి కలిసి పనిచేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ ఐపిఎస్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ సూచించారు. మండలంలోని పావులూరి వీరాంజనేయస్వామి సన్నిధిలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రైతాంగ సమస్యలపై ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాగండ్ల, భీమవారం, పావులూరు, ఇంకొల్లు, కొనికి గ్రామాల నుంచి వచ్చిన రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా ఉంటుందన్నారు. రైతే రాజు అనే నానుడిని నిజం చేయాలన్నారు. పనికి ఆహార పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాట ధరను రైతులే నిర్ణయించే విధంగా రైతులందరూ సంఘటితంగా ఉండి ఆర్థికంగా పుంజు కోవాలన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే దాని కన్నా మనమే మన జీవితాలను బాగుచేసుకోవాలని సూచించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి తన వంతు పూర్తి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి భధ్రిరెడ్డి, జడ్‌పిటిసి జి వెంకటరావు, వి ఆంజనేయులు, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జిల్లా అధ్యక్షుడు కె సురేష్, రోటరీక్లబ్ సభ్యులు షేక్ హన్ను, రాఘవరాజు, పి రామోహనరావు, ఎస్ రామోహనరావు, జెట్టి స్వామి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.