ప్రకాశం

ఒంగోలు డెయిరీ చైర్మన్ ఎంపికపై సీఎం నిర్ణయం ఏమిటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 20:ఒంగోలు డెయిరీ వ్యవహారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశవౌతుంది. తనను చైర్మన్‌గా ఉండమంటే ఉంటా లేకపోతే రాజీనామా చేస్తానంటూ ఈనెల 17న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు లేఖను విజయవాడలో చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు సమర్పించారు. ఈవిషయాన్ని ఆంధ్రభూమి ప్రతినిధికి కూడా తెలిపారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయమంటే తాను సిద్ధంగా ఉన్నానంటూ శిద్దా వెల్లడించారు. అదేవిధంగా తనకు 40సంవత్సరాల నుండి రైతులతో అనుబంధం ఉందని కూడా ముఖ్యమంత్రికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. తాను మూడు నెలలపాటు రైతులకు చెక్కులు ఇచ్చేందుకు కూడా నగదును సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు.
నూతనంగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత శిద్దా విలేఖర్లతో మాట్లాడుతూ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేస్తానని అదేవిధంగా తన స్వంత నిధులను సైతం వెచ్చించి పూర్వవైభవం తీసుకువస్తానని ప్రకటించటం జరిగింది. కాని రోజులు గడుస్తున్నప్పటికీ డెయిరీ వ్యవహరంలో మాత్రం అడుగులు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డెయిరీ పాలకవర్గాన్ని రద్దుచేయించి ఆ స్థానంలో జిల్లాకలెక్టర్‌తో ఒక కమిటీని నియమించి డెయిరీని ఒక గాడిలో పెట్టాలని నిర్ణయించారా అన్న చర్చ కూడా తెలుగుతమ్ముళ్ల నుండి వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలోను ఒంగోలు డెయిరీ వ్యవహరాన్ని తెరపైకి తీసుకురాలేదు.దీన్నిబట్టి చూస్తే ఒంగోలు డెయిరీ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి గుంభనంగా ఉంచి ఆ తరువాత కార్యచరణను ప్రకటించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతుంది. ప్రధానంగా ఒంగోలు డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, పాలరైతులు, ట్రాన్స్‌ఫోర్టు సిబ్బంది అందరు మరోసారి ఉద్యమం చేసేందుకు సిద్ధవౌతున్నట్లు తెలుస్తొంది. గతంలో డెయిరీని కాపాడాలంటూ ఆయావర్గాలకు చెందిన వారు పెద్దఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనలకు అన్ని రాజకీయపక్షాల నుండి మద్దతు లభించింది. ప్రస్తుతం మాత్రం ఒంగోలు డెయిరీ వ్యవహరం మొత్తం ముఖ్యమంత్రి కోర్టులో ఉండటంతో ఆయన ఏనిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ తెలుగుతమ్ముళ్ల నుండి వినిపిస్తోంది. నూతన చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు మాత్రం దేనికైనా సిద్ధమంటూ గుంభనంగా ఉండటం గమనార్హం. మొత్తంమీద ఒంగోలు డెయిరీ వ్యవహరం మరో అగ్రిగోల్డ్‌లాగా తయారవుతుందో లేక గాడిలో పడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.