ప్రకాశం

మార్కాపురంలో మట్టిదొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, మే 21: మార్కాపురం చెరువుచుట్టూ ఆక్రమణలు చోటుచేసుకోవడంతోపాటు చెరువుమట్టిని కొందరు వ్యాపారులు అక్రమంగా అర్థరాత్రి వేళల్లో తవ్వుకొని తరలించుకుపోతుండడంతో మార్కాపురం చెరువు కుచించుకుపోతోంది. ఇటుక బట్టీల వ్యాపారులు ప్రతిరోజూ అర్థరాత్రి మొదలు తెల్లవారుజాము వరకు తవ్వకాలు జరుపుతూ రోజుకు 200 ట్రాక్టర్ల మేర మట్టిని తరలించుకుపోతున్నారు. ఇటీవల అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టి సారించిన ఆర్డీవో పెంచలకిశోర్ చెరువులో ఉన్న జెసిబి యంత్రాలతోపాటు 12 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని తవ్వకందారులకు అధిక మొత్తంలో జరిమానా విధించి మొదటితప్పుగా వదిలివేశారు. అయినప్పటికీ వ్యాపారులు రోజుమార్చిరోజు తవ్వకాలు జరుపుతూ మట్టి తరలింపులకు పాల్పడుతున్నారు.
మట్టి తవ్వకాలు జరగాల్సిందిలా..
చెరువు, కాలువలకు సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. చెరువుమట్టి అవసరమైనవారు ముందుగా ఆ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించి మట్టితవ్వకాలకు అనుమతిపొంది సగటున ఒక్కో ట్రాక్టర్‌కు నిర్దేశిత నగదును చెల్లించాల్సి ఉంది. అయితే ఎలాంటి అనుమతి పొందకుండా ఇష్టారాజ్యంగా కొందరు వ్యాపారులు తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది.
డిఇఇ వివరణ
నీటి పారుదల శాఖ మార్కాపురం డివిజన్ కార్యాలయంలో సిబ్బంది కొరత అధికంగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడిందని నీటి పారుదల శాఖ డిఇఇ కళాధర్ వివరణ ఇచ్చారు. అక్రమంగా చెరువును తవ్వుతున్నవారిపై పలుమార్లు కేసులుపెట్టి జరిమానాలు విధించామని, కానీ తవ్వకందారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటీవల ఆర్డీవో నేతృత్వంలో దాడులు నిర్వహించి జరిమానాలు విధించినట్లు తెలిపారు.