ప్రకాశం

పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 22: పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక రైజ్ ఇంజనీరింగ్ కాలేజి ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో 25వ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి శిద్దా, కొండెపి శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి విచ్చేసి తొలుత వన చైతన్యరథాన్ని, బెలూన్ తిమింగాలన్ని, ఒంగోలు ఎద్దులను పరిశీలించి జీవనవైవిధ్యంపై వివిధ సంస్థలు ఏర్పాటుచేసిన ప్రదర్శనలను ప్రారంభించారు. అనంతరం కాలేజి ఆడిటోరియంలో మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులు, మహిళలు, పర్యావరణ ప్రేమికులనుద్దేశించి మాట్లాడారు. జీవవైవిధ్యం మానవ జీవితానికిచాలా అవసరమన్నారు. జీవ వైవిధ్యం ప్రకృతి కేంద్ర సూత్రమని అద్భుతమైన వివిధరకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల సమ్మేళనంతో ఏర్పడిన పర్యవరణ వ్యవస్థలని, పరస్పరం సంబంధం కలిగి ఉంటుందన్నారు. రానురాను అడవులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జంతువులు, వృక్షజాతులు, అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలోనే కాకుండాప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 2029సంవత్సరం నాటికి 50శాతం పచ్చదనం పెంపుదల కావాలని ముఖ్యమంత్రి సంకల్పించారన్నారు. ప్రస్తుతం 23శాతం అటవీభూభాగం ఉందన్నారు. పారిశ్రామిక ప్రదేశాలు, ప్రైవేటుస్ధలాల్లో సైతం పెద్దఎత్తులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. వనం-మనం కార్యక్రమం కింద గత నాలుగుసంవత్సరాలుగా రాష్ట్రంలో 50కోట్లమొక్కలు నాటామన్నారు. ఇందుకోసం అన్ని స్వచ్చంధ సంస్ధలు, రోటరీక్లబ్బులు సహకరిస్తున్నాయన్నారు. గతసంవత్సరం 2140 చదరపు కిలోమీటర్ల మేరకు పచ్చదనం పెంచి దేశంలోనే 29 రాష్ట్రాల్లో అగ్రగ్రామిగా నిలిచి బహుమతిపొందామన్నారు. పచ్చదనం పెంపుదల, పర్యావరణ సమతుల్యంత, చెట్లను నరికివేయకుండా రక్షించటం వలన సకాలంలో వర్షాలు పడతాయన్నారు. జీవవైవిధ్య సంస్థకు నిధుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైన నిధులు కేటాయింపుకు కృషిచేస్తానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు గ్రామస్థాయిలో ఏర్పాటైన కమిటీలు సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. కొండెపి శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ప్రకృతిలోని అన్ని సమతుల్యతలు పాటించాలని, లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రకృతిని మనం సంరక్షించితే అది మనల్ని కాపాడుతుందన్నారు. మానవ మనుగడకు పశుపక్షాదులు, వృక్షాలు చాలా అవసరమన్నారు. ప్రకృతిలో అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్నామన్నారు. అనవసరంగా ఏ ఒక్కరికి హాని తలపెట్టరాదన్నారు. గతంలో రహదారి వెంట చింత, వేపచెట్లు ఉండేవని నేడు అవి కనుమరుగు అవుతున్నాయన్నారు. చెట్లను కాపాడుకోవాలే కాని వాటిని నాశనం చేయరాదన్నారు. రాష్ట్ర జీవవైవిధ్య సంస్థ చైర్మన్ ఎస్‌బిఎల్ మిశ్రా మాట్లాడుతూ భారతదేశం అడవులు, చిత్తడినేలలు సముద్రతీర ప్రాంతాల్లో జీవవైవిధ్యం ద్వారా గొప్పసంపదను కలిగి ఉందని, దాన్ని భావితరాలకు అందించేందుకు సంస్థ కృషి చేస్తుందన్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో భారతదేశం 2002సంవత్సరంలో జీవవైవిధ్య చట్టాన్ని రూపొందించిందన్నారు. జీవ వైవిధ్యం కాపాడేందుకు సంస్థ చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. అనంతరం జీవవైవిధ్యంపై రూపొందించిన వివిధ బ్రోచర్లు, గోడపత్రికలను మంత్రి శిద్దా ఆవిష్కరించారు.జీవ వైవిధ్య రిజిష్టర్ల్రను 13జిల్లాల యజమాన్య కమిటీ అధ్యక్షులకు మంత్రి అందచేశారు. తదనంతరం ఉత్తమ జీవవైవిధ్య సంరక్షలుగా తూర్పుగోదావరి జిల్లాకాకినాడకు చెందిన ఉపాధ్యాయులు కేసరి శ్రీనివాసరావు, కర్నూలు ప్రభుత్వపురుషుల కాలేజి వృక్షశాస్త్ర అధ్యాపకులు డి రాఘరాములు మంత్రి చేతులమీదుగా బహమతులు అందుకున్నారు. అలాగే జీవ వైవిధ్య ఉత్తమ సంరక్షులుగా సంస్థల కేటగిరిల్లో మెస్సర్స్ ఉమర్ అలీషా రూరల్ డవలప్‌మెంట్ ట్రస్టు వారికి మంత్రి అందించారు. జీవవైవిధ్య ఫొటోగ్రఫీలో తిరుపతికి చెందిన కె కార్తీకసాయి, సాంప్రదాయ విజ్ఞాన ప్రాక్టీషనర్లుగా ముత్తా వెంకటరమణ, దంతలూరి సత్యవతి,యాక్సెస్ భెనిఫిట్ షేరింగ్ మెకానిజం కింద మెస్సర్స్ ధరణి ఫారెస్ట్స్ అండ్ ఆర్చర్డ్స్ లిమిటెడ్ గుంటూరు వారికి మంత్రి శిద్దా ఉత్తమ పురస్కారాలను అందచేశారు. ఈకార్యక్రమంలో జీవవైవిధ్య సంస్ధ సభ్య కార్యదర్శి సతీష్‌కుమార్ కౌషిక్, రైస్ ఇంజనీరింగ్ కాలేజి డైరెక్టర్ భాస్కరరావు, డిఎఫ్‌ఒలు మహుబూబ్‌బాషా, జయచంద్రారెడ్డి, మత్స్యశాఖ జెడి బలరాంతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు,ప్రజాప్రతినిధులు,రైతులు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.