శ్రీకాకుళం

ముగిసిన పీజీ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల,జూన్ 19: ఈ విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల ప్రవేశానికి అంబేద్కర్ విశ్వ విద్యాలయం సెట్ నిర్వహించి సీట్లు భర్తీకి రెండో విడత కౌనె్సలింగ్‌ను గత రెండు రోజుల్లో పూర్తి చేసింది. ఈ సందర్భంగా చివరిరోజు 27 మంది కౌనె్సలింగ్‌కు హాజరయ్యారు. క్యాంపస్‌లోని 17 కోర్సులున్నప్పటికీ సెట్ ఆధారంగా ఆశించిన స్థాయిలో అభ్యర్థులు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ కారణంగా జూలై 3,4 తేదీల్లో రెండో పర్యాయం ప్రవేశాలకు అనుగుణంగా అంబేద్కర్ వర్సిటీ సెట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై వైస్ ఛాన్సలర్ రామ్‌జీ సంబంధిత ఆచార్యులతో చర్చించినట్లు తెలిసింది. ఏది ఏమైనా అంబేద్కర్ విశ్వ విద్యాయలం అందిస్తున్న కోర్సులుకు సంబంధించిన సీట్లు భర్తీ పూర్తయ్యేపరిస్థితులు కానరావడం లేదు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో సోంపేట మెహిత్
సోంపేట, జూన్ 19: దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారి ప్రతిభా పాటవాలను గుర్తించి వారికి ఒక గుర్తింపు తేవాలన్న ఆశయంతో ఏర్పడిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో సోంపేటకు చెందిన ఈశ్వరరావు, లక్ష్మిల కుమారుడు నాలుగవ తరగతి విద్యార్థి మోహిత్‌కు గుర్తింపు లభించింది. మండల బుద్దప్రసాద్, మాజీ జెడి లక్ష్మినారాయణ వంటి ప్రముఖులు ముఖ్య సలహాదారులుగా ఉన్న ఈ సంస్థకు డాక్టర్ సిహెచ్ వెంకటాచారి అధ్యక్షతన నడుస్తుంది. ఈ సంస్థ ప్రముఖులు సమావేశమై మోహిత్ ప్రతిభాపాటవాలను గుర్తించి ఇందులో నమోదు చేసినట్లు ప్రకటించారు. దృవపత్రంతోపాటు షీల్డ్‌ను అందించారు. మెహిత్ ప్రపంచపటంలో 331 ప్రదేశాలను గుర్తించడంలో ప్రతిభ కనబరిచాడు.