ప్రకాశం

మాజీ ఎంపి వైవితో అన్నా చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూన్ 23: ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డిని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి చర్చలు జరిపారు. గత కొంతకాలంగా అన్నా రాంబాబు వైకాపాలో చేరుతారన్న ప్రచారం జరుగుతుండడంతో మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డిని కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 2009లో గిద్దలూరు ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించిన అన్నా అప్పుడు జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విభజన జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకొని 2014లో గిద్దలూరు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. పరిస్థితుల ప్రభావంతో గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన అశోక్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో న్యాయం జరగడం లేదని భావించి టీడీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం ప్రజల మనిషిగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే అన్నా వైకాపాలో చేరుతారని ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈనేపధ్యంలో శుక్రవారం రాత్రి మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలాఉంటే యర్రగొండపాలెం టీడీపీ సీనియర్ నేత, మాజీ జడ్పీ వైస్‌చైర్మన్ డాక్టర్ మనె్న రవీంద్ర కూడా త్వరలో వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గంలో మంత్రుల పర్యటన జరిగిన, టిడిపి కార్యక్రమాలు జరిగిన దూరంగా ఉంటూ గత రెండురోజుల కిందట వైసిపిలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ పొందినట్లు సమాచారం. ఏదిఏమైనా రోజురోజుకు మార్కాపురం డివిజన్‌లో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి.
‘అభినందన సభను జయప్రదం చేయండి’
త్రిపురాంతకం, జూన్ 23: శ్రీశైలంకు తూర్పు ముఖద్వారమైన త్రిపురాంతకంలో వెలసిన శ్రీత్రిపురాంతకేశ్వర బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారి ఆలయ ట్రస్టుబోర్డు కమిటీని నియమించిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేయనున్న అభినందన సభను జయప్రదం చేయాలని ట్రస్టుబోర్డు చైర్మన్ గోళ్ళ వెంకటసుబ్బారావు కోరారు. ఈ అభినందన సభకు యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు అధ్యక్షతన వహించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, అటవీ, సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి నారాయణ, రాష్ట్ర మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ మంత్రి సిహెచ్ ఆదినారాయణరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, గిద్దలూరు ఎమ్మెల్యే ఎం అశోక్‌రెడ్డి, తెనాలి ఎమ్మెల్యే ఎ రాజేంద్రప్రసాద్, మార్కాపురం టిడిపి ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్, జడ్పి వైస్‌చైర్మన్ నూకసాని బాలాజీ, ప్రముఖవైద్యులు దొనకొండ జడ్పిటిసి డాక్టర్ మనె్న రవీంద్ర, ఎపి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లుతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.