క్రైమ్/లీగల్

ప్రాణంతీసిన ప్రేమలేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థవీడు, జూలై 13: ప్రియురాలికి ప్రేమలేఖ ఇవ్వలేదన్న ఆక్రోశంతో 7వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగులపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రవితేజ (12) శుక్రవారం మధ్యాహ్నం గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలలో మృతిచెందాడు. ఈనెల 7వ తేదీన జరిగిన ఘటనలో రవితేజకు శరీరంలోని వివిధ అవయవాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో మెరుగైన వైద్యచికిత్స కోసం గుంటూరు వైద్యశాలలో చేర్పించారు. మృత్యువుతో వారంరోజులపాటు పోరాడిన రవితేజ శుక్రవారం మృతిచెందాడు. రవితేజ తల్లిదండ్రులు మెట్ల వెంకటలక్ష్మమ్మ, శేఖర్ శోకసంద్రంలో మునిగిపోయారు. అర్థవీడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి సంఘటనలు విద్యాసంస్థల్లో జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రవితేజ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
* కేసు నమోదు
మార్కాపురం, జూలై 13: పట్టణంలోని 1వ వార్డులో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. పట్టణ ఎస్సై కోటయ్య కథనం ప్రకారం విద్యుత్ కార్యాలయం వెనుకవైపున గల కురుకుంద ఆదిలక్ష్మి (40) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు గత ఎనిమిది సంవత్సరాల కిందట వివాహం కాగా సుమారు 7 సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటూ తల్లి ఇంట్లో ఉంటోంది. అయితే శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు రావడంతో మార్కాపురం సిఐ భీమా నాయక్ ఆధ్వర్యంలో సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో
మొత్తం 49 మందికి జైలుశిక్ష
ఒంగోలు, జూలై 13: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో మొత్తం 49మంది వ్యక్తులకు జైలుశిక్ష పడినట్లు ఒంగోలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ డిఎస్‌పి వేణుగోపాల్ గురువారం తెలిపారు. ఈ డ్రంకన్ డ్రైవ్ కేసులో మొత్తం ఒక లక్షా 82వేల 900 రూపాయలు కోర్టు వారు జరిమానా విధించినట్లు డిఎస్‌పి తెలిపారు. ప్రకాశం జిల్లా వాసుల్లో కొందరు మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలపాలవుతున్నట్లు తెలిపారు. దీంతో జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు దీనివాలన జరిగే ప్రాణ, వ్యక్తిగత, ఆస్తి నష్టాలను అరికట్టాలన్న ఉద్దేశ్యంతో మద్యం సేవించి వాహనాలను తనిఖీ చేయాలని పోలీసు అధికారులకు సూచించినట్లు డిఎస్‌పి తెలిపారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు వారి వారి పరిధిలోని ప్రదేశాలలో ఈనెల 6 నుండి 12వ తేదీ వరకు వాహన చోదకులకు డ్రంకన్ డ్రైవ్‌పై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో మొత్తం 332 మందిని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి, వారిపై ఎంవి యాక్ట్ సెక్షన్ 185 (ఎ) ప్రకారము కేసులు నమోదు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. వారిలో 124 మందిని కోర్టులో హాజరుపరచగా, 49 మంది వ్యక్తులకు జైలుశిక్ష, మిగిలిన వారికి జరిమానా విధించినట్లు డిఎస్‌పి తెలిపారు.