ప్రకాశం

ఆత్మప్రభోధానుసారమే జర్నలిస్టులు వృత్తిని నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 19: ఆత్మప్రభోధానుసారమే జర్నలిస్టులు వృత్తిని నిర్వర్తించాలని జాప్ రాష్ట్ర అధ్యక్షులు పున్నం రాజు అన్నారు. సమాజంలోని రుగ్మతలను పాత్రికేయులు ఎత్తిచూపే క్రమంలో వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత జర్నలిస్టుల సంఘాలకు ఉందని ఆయన తెలిపారు. గురువారం స్థానిక కర్నూల్ రోడ్డులోని ఉదయం అక్షరం పత్రికా కార్యాలయంలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పున్నం రాజు మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని ఆయన తెలిపారు. జాప్ ఈ దిశగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాప్‌లో ఇటీవల కొందరు సృష్టించిన సంక్షోభాన్ని జిల్లా కార్యవర్గాలు ఎదుర్కొని రాష్ట్ర నాయకత్వానికి అండగా నిలబడటం తాము గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ జాప్‌కు అండగా నిలబడ్డ జిల్లా కార్యవర్గ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సహకారంతో, ఇదే స్ఫూర్తితో జర్నలిస్టులకు , ప్రజలకు సామాజిక సేవాకార్యక్రమాలు చేయాలని జిల్లా యూనియన్ నాయకులు , కార్యవర్గ సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలతో నడుస్తున్న జాప్ ఎన్నో విజయాలను సాధించినట్లు ఆయన తెలిపారు. జాప్ రజతోత్సవంలో భాగంగా అన్ని జిల్లా శాఖలు నిబద్ధతతో పనిచేయాలని ఆయన కోరారు. జర్నలిస్టులకు ప్రత్యేక పింఛన్ పథకం తీసుకురావాలనే లక్ష్యంతో అన్ని జర్నలిస్టు సంఘాలను కలుపుకొని పనిచేస్తామని ఆయన తెలిపారు. జాప్ పేరుతో చలామణి అవుతున్న నకిలీ నాయకులను వారి ప్రకటనలను నమ్మవద్దని యుగంధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక సంస్థకు వ్యక్తులు ఎప్పుడు ప్రధానం కాబోరని వ్యవస్తికృత ప్రజాస్వామ్యంలో నడుస్తున్న జాప్ ఎన్నో విజయాలు సాధించిందని ఈ రజతోత్సవ సంవత్సరంలో జాప్ కొన్ని సుదీర్ఘ లక్ష్యాలను నిర్ధేశించుకొని పనిచేస్తున్నామని, అందులో భాగంగా జాప్‌లో పనిచేసిన సీనియర్లు అందరిని కలుపుకొని వారి సలహాలు అనుభవాలతో అత్యున్నత వైభవం తీసుకరాగలమని, అందుకు అన్ని జిల్లా శాఖలు నిబద్ధతతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకారెడ్డి, జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, సీనియర్ నాయకులు కె శివకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్‌రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి గోపాల్, జిల్లా కార్యదర్శి ఎ సుబ్బారావు, జిల్లా కోశాధికారి పి సురేంద్రకుమార్, జిల్లా , మండల స్థాయి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.