ప్రకాశం

నిజాలు నిగ్గు తేల్చేందుకే కేంద్రంపై అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూలై 19: నిజాలు నిగ్గు తేల్చేందుకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారని తెలుగుదేశంపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, పార్టీ మండల అధ్యక్షుడు కామేపల్లి శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు చర్చించి పరిష్కరించేందుకు కేంద్రస్థాయిలో పార్లమెంటు, రాష్టస్థ్రాయిలో అసెంబ్లీ వేదికలని అన్నారు. విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పినప్పటికీ, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్షకట్టి తెలుగుప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ పార్టీ ధర్మపోరాట దీక్షలు చేస్తుంటే ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు వైకాపా అధినేత జగన్ నరేంద్రమోదీకి లొంగిపోయారని విమర్శించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో 13సార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తే ప్రభుత్వ లోపాలు ఎక్కడ బయట పడతాయోనని ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు సమావేశాలకు హాజరవకుండా స్పీకర్ ద్వారా అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కుట్ర రాజకీయాలు చేశారన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తిరిగి అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చి చర్చకు వచ్చేలా 145మంది ఎంపీల మద్దతు కూడగట్టడటం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ చతురతకు నిదర్శమన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మేధావులతో సమావేశాలు ఏర్పాటుచేసి సుమారు 75వేల కోట్లరూపాయలు రావాలని లెక్కలు తేల్చిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వౌనం వెనుక బీజేపీ ఉందన్న నగ్నసత్యం ప్రజలకు తెలుసని చెప్పారు. శుక్రవారం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చతో రాష్ట్రానికి ప్రధాని చేసిన అన్యాయం తేటతెల్లం అవుతుందన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు జరిగే విషయంలో బీజేపీని ఎండగట్టాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, గిరిజన విశ్వవిద్యాలయం, ప్రత్యేక హోదా తదితర విభజన చట్టంలోని అంశాలను పోరాటం ద్వారా సాధించుకుంటామన్నారు. విలేఖరుల సమావేశంలో టీడీపీ నాయకులు బొమ్మినేని మురళీకృష్ణ, కొల్లిపల్లి సురేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా సాయినామ సప్తాహ వేడుకలు
కనిగిరి రూరల్, జూలై 19: పట్టణంలోని శ్రీషిరిడి సాయినాథుని ఆలయంలో గురువారం అఖండ సాయినామ సప్తాహ వేడుకలు వైభంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్బంగా సానికొమ్ము రంగనాయకులరెడ్డి దంపతులు అఖండ జ్యోతి ప్రజ్వలనం చేయగా ధనేకుల తిరుమలయ్య దంపతులు గోపూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో శ్రీషిరిడి సాయినాధునికి పెరుగు మురళి దంపతులు, కనమర్లపూడి మల్లికార్జునరావు దంపతులు ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో 7రోజులపాటు ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి నామంతో అత్యంత భక్తిశ్రధ్ధలతో సప్తాహ వేడుకలను నిర్వహించనున్నారు. ఆలయంలో దత్తకారుణ్యట్రస్ట్ శ్రీరాం రతన్‌బాబా నేతృత్వంలో సచ్ఛరిత్ర పారాయణ సప్తసప్తాహ మహాయజ్ఞం జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈసందర్భంగా శ్రీషిరిడి సాయినాధునికి పేర్ల సుబ్బారావు దంపతులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలలో పాల్గొని విశేష పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్బంగా శ్రీరాం రతన్‌బాబా మాట్లాడుతూ అఖండ జ్యోతి వద్ద బాబా పారాయణం చేసిన భక్తుల సంచిత కర్మల నుండి విముక్తి పొందుతారని, పారాయణం ద్వార మానసిక ప్రశాంత కలుగుతుందని ఆయన అన్నారు. పూజా కార్యక్రమాలలో విశేషంగా భక్తులు పాల్గోని తీర్దప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ దేవకి సుబ్రహ్మణ్యం, పెన్నా వెంకటేశ్వర్లు, ముచ్చెర్ల ధర్మారావు, వాగిచెర్ల వెంకటేశ్వర్లు, అంగులూరి చెంచులు, వి రామశాస్ర్తీ, బద్వేలు కృష్ణమూర్తి, ఈర్ల గురవయ్య, ఇరువూరి నరసారెడ్డి, పల్లా మాలకొండయ్య తదితరులు పర్యవేక్షించారు.