ప్రకాశం

27న రైతు పోరాట దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూలై 19: జిల్లాలోని రైతుల సమస్యలపై ఈ నెల 27వ తేదీన కలెక్టరేట్ వద్ద రైతు పోరాట దీక్షను నిర్వహిస్తున్నట్లు కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు, రైతు సంఘం నాయకులు అబ్బూరి వెంకటేశ్వర్లు, హనుమారెడ్డి తెలిపారు. గురువారం రైతుసంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో గత నాలుగు సంవత్సరాల నుంచి వరుసగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సంవత్సరం ఇప్పటివరకు వర్షాలే లేవని, ఈ పరిస్థితుల్లో పండించిన కొద్దిపాటి పంటకు ధరలు లేక జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం అయ్యాయని, కనీస చర్యలు కూడా చేపట్టలేదన్నారు. జిల్లాలో రెండులక్షల ఎకరాల్లో శనగపంట సాగు చేశారని, జెజె-11 రకం ధర పదివేల రూపాయల నుంచి ఇప్పుడు 4200 రూపాయలకు చేరిందన్నారు. కనీస ధర క్వింటాకు ఆరువేల రూపాయలు లభిస్తేనే పెట్టిన పెట్టుబడి రైతుకు దక్కుతుందని, తిరిగి వ్యవసాయం చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. శనగల క్వింటా కనీస ధర ఆరువేల రూపాయలుగా నిర్ణయించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుబాబుల్, జామాయిల్ కొనుగోళ్లకు ప్రభుత్వం జీవో 31ని ప్రకటించిందని, సుబాబుల్ 4200రూపాయలు, జామాయిల్ 4400 రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పర్మిట్ల మీద నగదు గ్యారెంటీ లేదన్నారు. మిల్లు యజమానులు, ఆర్‌సీ హోల్డర్లు రైతుల నుంచి 2600 రూపాయలు నుంచి 1800 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జీవోను అమలు చేయకుండా రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్న మిల్లు యజమానులపై కఠినచర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలన్నారు. రైతులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వం ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటుచేసి సమస్యలపై చర్చించి ఏడునెలలు కావస్తున్నా ఇంతవరకు ఫలితం దక్కలేదన్నారు. ఈ సమస్యలపై కలెక్టరేట్ వద్ద ప్రకాశం రైతుపోరాట దీక్ష పేరుతో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైతులు విరివిగా పాల్గొని దీక్షను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు కాకర్ల వెంకటేశ్వర్లు, రామారావు, శ్రీనివాసరెడ్డి, వినోద్, జయంతిబాబు, సుబ్బారెడ్డి, చుండూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు.