ప్రకాశం

గౌరవానికి భంగం కలిగిస్తే పోరాటాలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, జూలై 23: అన్ని విధాలుగా కష్ట, నష్టాలకు ఓర్చి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని భుజస్కంధాలపై మోశానని, ప్రస్తుతం పార్టీలోని నాయకులు విలువలకు, గౌరవానికి భంగం కలిగిస్తే వారు ఎంతటి వారైనా పోరాటాలకు సిద్ధమని వైకాపా రాష్ట్ర కార్యదర్శి తూమాటి మాధవరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక రాజ్ థియేటర్ ఆవరణంలో నియోజకవర్గ స్థాయి తన అనుచరులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది నాయకులు పార్టీలోకి వస్తూపోతున్నారన్నారు. ఎమ్మెల్యే పోతుల రామారావు వైకాపాను వీడినప్పటి నుంచే వైకాపా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా, కొందరి కుట్రల ఫలితంగా మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైకాపాలో చేరారని పరోక్షంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. పార్టీలోని కొందరు నేతలు పార్టీ నుంచి తనను సాగనంపేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. రూ.4 కోట్లు డబ్బులు తీసుకుని పార్టీ సమన్వయకర్తగా తొలిగినట్లు కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, డబ్బులు, పదవులను ఆశించి రాజకీయాల్లోకి రాలేదని తూమాటి మాధవరావు అన్నారు. మరి కొంత మంది టీడీపీలో చేరనున్నట్లు దుష్ప్రచారాలు చేస్తున్నారని, టీడీపీలో చేరే ఆలోచన ఉంటే ఆ పార్టీతో తనకు ఉన్న సంబంధాలు, పరిచయాలు ఇతర నాయకులెవరికీ లేవన్నారు. తొమ్మిదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. ప్రస్తుతం పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్న వారితో సమాలోచనలు చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వైకాపా ప్రాంతీయ పార్టీ అని, ప్రస్తుతం పార్టీలో చేరిన నేత వెటకారాలు, చతురులు మానుకుని పార్టీలోని అందరిని కలుపుకునిపోవాలన్నారు. జగన్మోహన్‌రెడ్డి నిర్ణయమే తమకు శిరోధార్యం అని, ఆయన నిర్ణయానికి కట్టుబడి పార్టీలో పని చేస్తానని తూమాటి చెప్పారు. అనంతరం కొందరు తూమాటి అనుచరులు మాట్లాడుతూ తూమాటి అడుగు జాడల్లోనే నడుస్తామన్నారు. ఈ సమావేశంలో గుడ్లూరు జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, వైకాపా పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, మండల కన్వీనర్లు దామా ప్రవీణ్, మహిళా నాయకురాలు కామాక్షినాయుడు, గంగిరెడ్డి, కోటేశ్వరరావు తదితర నాయకులతోపాటు తూమాటి అనుచరులు పాల్గొన్నారు.