ప్రకాశం

మైనార్టీల అభివృద్ధిలో త్రికరణశుద్ధి ఏది ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, జూలై 23 : మైనార్టీలపై రాష్ట్రప్రభుత్వానికి త్రికరణశుద్ధిలేకపోవడంతో ముస్లిం మైనార్టీల అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. జిల్లాస్థాయి నుంచి మండల, గ్రామస్థాయిల వరకు మైనార్టీలకు ప్రోత్సాహం కరువవడంతో విద్యా, ఉపాధితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పథకాలరూపంలో శిలాఫలకాలుగా మొండిగోడలుగా దర్శనమిస్తున్నాయి. సుమారు 25వేలమంది ముస్లిం జనాభాగల మార్కాపురం పట్టణంలో ఉర్దూ జూనియర్ కళాశాల, హైస్కూల్ లేకపోవడంతో ముస్లింలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌కేంద్రంగా ఉన్న మార్కాపురంలో గతంలో ఉర్దూ పాఠశాల ఉండేది. ఆ సమయంలో పట్టణ ముస్లిం పెద్దలు ఉర్దూ డెవలప్‌మెంటు సొసైటీని ఏర్పాటు చేసుకొని అప్పటి ఎమ్మెల్యే కెపి కొండారెడ్డి సహకారంతో ప్రత్యేక తరగతి గదులను నిర్మించుకొని విద్యను అభ్యశించుకునేవారు. జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఈ పాఠశాల ద్వారా రెండు బ్యాచ్‌ల విద్యార్థులు ఉర్దూ పదవ తరగతి పరీక్షలు రాశారు. అయితే పాలకుల నిర్లక్ష్యంతో ఉర్దూ పాఠశాలకు ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయని కారణంగా ఉపాధ్యాయుల కొరతతోక్రమక్రమంగా ఉర్దూ హైస్కూల్‌ను ఎత్తివేశారు. జిల్లావ్యాప్తంగా డివిజన్‌లోని కంభంలో ఒక్కచోట మాత్రమే ఉర్దూ జూనియర్ కళాశాల, హైస్కూల్‌ను నడుపుతున్నారు. గతంలో పదేళ్లుగా ఉర్దూ పాఠశాల, కళాశాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుండటంతో ఒక్క మార్కాపురం పట్టణంలోనే ఉర్దూ పాఠశాలలకు ప్రత్యామ్నాయంగా 20 బాలికల మదరసాలు వెలిశాయి. రోష్నీ పథకం కింద ప్రతి 20మంది విద్యార్థులకు ఒక ఉర్దూ విద్యావాలెంటరీని కేటాయిస్తూ 14పోస్టులను మున్సిపాలిటీ పాఠశాలలకు ఇవ్వగా వాటిని కూడా నేటికీ భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వానికి మైనార్టీలపై ఉన్న ప్రేమ ఏపాటిదో చెప్పకనే అర్థం అవుతుందని ఉర్దూ డెవలప్‌మెంటు సొసైటీ సభ్యులు అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డివిజన్ కేంద్రమైన మార్కాపురంలో ముస్లిం మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

* శిలాఫలకాలకే పరిమితమైన కళాశాల
2005లో పల్లెబాట కార్యక్రమానికి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింల విజ్ఞప్తి మేరకు షాదీఖానాను మంజూరు చేశారు. కంభంరోడ్డులోని చిన్నపిల్లల పార్కు స్థలాన్ని షాదీఖానాకు కేటాయిస్తూ నిర్మాణార్థం 60లక్షల రూపాయలను మంజూరు చేశారు. సంబంధిత జీవో మంజూరైనప్పటికీ నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో నేటికీ షాదీఖానా నిర్మాణానికి నోచుకోలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం అనంతరం 2012 అక్టోబర్ 10న అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశంపార్టీ 2016 మార్చి 27న రాష్ట్ర ఐటి, మైనార్టీ, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రెండవసారి అదే స్థలానికి శంకుస్థాపన చేసి త్వరితగతిన షాదీఖానా నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ నేటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో మైనార్టీలపై ప్రభుత్వం, పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై ముస్లింలు పెదవి విరుస్తున్నారు. మైనార్టీలను ఓటుబ్యాంకుగా పరిగణించే పాలకులు వారి ఆర్థికాభివృద్ధికి, వౌలిక వసతుల కల్పనకు ఏమాత్రం కృషి చేయడం లేదని పేర్కొంటున్నారు.