క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో పసికందు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
పొదిలి, జూలై 27 : రోడ్డు ప్రమాదంలో ఒక పసికందు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం పొదిలి మండలంలోని మల్లవరం గ్రామ సమీపంలో జరిగింది. కనిగిరి మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన కొండయ్య, అతని భార్య లు ఏడు మాసాల పసికందుతో పాటు మరోక వ్యక్తి కారులో హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వెళుతుండగా శుక్రవారం ఉదయం మార్గ మధ్యలోని మల్లవరం గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి ఒక చెట్టుకు ఢీ కొట్టింది. ఈప్రమాదంలో కొండయ్య కుమారుడు బత్తుల దేవాన్షు ( ఏడు మాసాలు ) అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మృతి చెందిన పసి కందుతో పాటు క్షతగాత్రుడ్ని పొదిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొండయ్య, మరో ఇద్దరికి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించారు. ఈ సంఘటన పై పొదిలి ఎయస్ ఐ ఎస్ వదూద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.