ప్రార్థన

క్రీస్తు తీఠ్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలో అందరూ తీర్పరులే. ఇష్టమొచ్చినట్లు తీర్పు తీరుస్తున్నారు. వాళ్లు మంచివాళ్లు కాదూ.. వీళ్లు మంచివాళ్లు కాదు అని అందరూ ఇచ్చే తీర్పులు చూస్తే లోకంలో మంచే లేదు అనిపిస్తుంది. అయితే యేసుప్రభువు చెప్పిన మాట -తీర్పు తీర్చవద్దని. (మత్తయి 7:11) - ముందు మిమ్ములను మీరు పరీక్షించుకొని ఆ తరువాత ఇతరులకు తీర్పు తీర్చవచ్చు అన్నట్లు వినబడుతోంది. ఇంకొకరికి తీర్పు తీర్చే ముందు స్వపరీక్ష అవసరం. తొందరపడి ఎవరినీ తీర్పు తీర్చకూడదు. మన కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాని కంటిలో నలుసును తీయటానికి ప్రయత్నించకూడదు. తప్పులెన్నువాడు తన తప్పులెరుగడు.
యోహాను 8:1-11లో శాస్త్రులును పరిసయ్యులును వ్యభిచారమందు పట్టుబడిన స్ర్తిని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలువబెట్టి ‘బోధకుడా! ఈ స్ర్తి వ్యభిచారము చేయుచుండగ పట్టుబడెను. అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్తమ్రులో మోషే ఆజ్ఞాపించెను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని’ అడిగిరి.
లోకరీతిగా ఆమె పట్టుబడింది. అయితే ప్రభువు దృష్టిలో అందరూ పట్టుబడ్డారు. ఏ భేదము లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేక పోతున్నారు. ఏలాగనగా మనుషుల ఆలోచనలలో వ్యభిచారము కన్నులలో వ్యభిచారము - అన్నీ ప్రభువుకు బాహాటముగా తెలుసు. ‘ఒక స్ర్తిని మోహపు చూపులతో చూచు ప్రతివాడును అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసినవాడగును’ -మత్తయి 5:28. మన ప్రతి అణువు ప్రతి అడుగు తెలిసిన ప్రభువు వారివైపు చూసి ‘మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చు’నని చెప్పెను. అప్పుడు చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఎవరూ ఆమె మీద రాయి విసరలేదు.
‘పాపము చేసిన స్ర్తిని గని పాపుల కోపము మండెగదదాపున చేరి పాపిని బ్రోచిన కాపరి యేసె గదా సిల్వధరా పాపహరా శాంతికరా’ - హే ప్రభు యేసు అయితే మగవారి సంగతేమిటి? వ్యభిచారము చేయుచుండగా పట్టుబడింది గదా! అంటే తీర్పులో పక్షపాతముంది. స్ర్తికి ఒక న్యాయం - పురుషునికి ఒక న్యాయం. ఉన్నవారికొక న్యాయం లేనివారికొక న్యాయం ఎప్పటి నుంచో ఉంది.
యేసు వారి వైపు తలఎత్తి చూసినప్పుడు, వారిలో ఉన్న అపరిశుద్ధత పాపము పగ ద్వేషము వ్యభిచారము అసూయ కక్ష క్రోధము ఎవరివి వారికి కనబడినవి. యేసు మన వైపు చూసిన మనము ప్రభువు వైపు అంటే ఆయన వాక్యము వైపు చూసినట్లయితే అన్నీ తేటగా అర్థవౌతాయి. అలాగే ఆయన శక్తి ఎంతటిదో ప్రేమ ఎటువంటిదో ఎంతగా మానవాళిని ప్రేమించాడో కూడా అర్థవౌతుంది. ఆయన శక్తిని ఎరిగిన రక్తస్రావముతో బాధపడుతున్న స్ర్తి యేసును ముట్టి స్వస్థత పొందింది.
ప్రభువు మాట విన్న సమరయ స్ర్తి ‘ఈయన క్రీస్తు కాడా?!’ అని ఊరందరితో చెప్పింది. ప్రభువు శక్తిగల మాటలు విన్నా చదివినా ఆయన శక్తిని మహిమను గ్రహించగలము.
శాస్త్రులును పరిసయ్యులును వెళ్లిపోయిన తరువాత యేసు తలయెత్తి ఆ స్ర్తి వైపు చూసి ‘అమ్మా వారెక్కడ ఉన్నారు?’ అని అడిగాడు. ఈ సంబోధన చూడండి. ‘అమ్మా’ అని ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో?! ‘ఎవరూ నీకు శిక్ష విధించలేదా?’ అని అడిగినప్పుడు - ఆమె ‘లేదు ప్రభువా!’ అని చెప్పెను. ప్రభువు మాటలనుబట్టి ఆమె -ఈయన ప్రభువని గ్రహించింది. అందరూ ‘బోధకుడా!’ అని సంబోధిస్తే ఈమె మాత్రం ‘ప్రభువా’ అని పిలిచింది. అప్పుడు యేసు ‘నేనును నిన్ను శిక్షింపను - ఇక ఏ పాపము చేయకుమ’ని చెప్పెను. ‘ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును’ - వారి పాపములను కూడా క్షమించును. మన పాప జీవితాన్ని క్షమించి నూతన జీవితమివ్వటానికే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మన అందరి పాపములు క్షమించటానికి ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశాడు. కనుక ఎవరినైనా ఎప్పుడైనా క్షమించగలడు. అందుకే చివరి నిమిషంలో సిలువపైన ఉన్న దొంగ క్షమించబడి క్రీస్తుతో పరదైశుకు వెళ్లాడు.
ప్రభువు క్షమిస్తున్నాడు కదాని పాపములోనే జీవించకూడదు. పాత జీవితాన్ని వదిలి క్రీస్తులో నూతన జీవితాన్ని గడపాలి. వ్యభిచారులు మాంత్రికులు హంతకులు అబద్ధీకులు త్రాగుబోతులు దొంగలు పిరికివారు అవిశ్వాసుల కందరికీ క్షమాపణ ఉంది కాని ఇక పాపము చేయకూడదు.
పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అంత అపరిమితముగా విస్తరించెను. అలాగైన కృప విస్తరించవలెనని పాపమందు నిలిచి యుందుమా? అట్లనకూడదు. ప్రభువు చెప్పినదేమంటే ఇకను పాపము చేయకుమని. తీర్పు తీర్చటము కూడా పాపమే కనుక ఎవరికీ తీర్పు తీర్చకూడదు. ప్రస్తుతమైతే మనము కృపాకాలములో ఉన్నాము కనుక ప్రభువు క్షమిస్తూ కృప చూపుచున్నాడు. పక్షపాతము లేదు. రికమండేషన్స్ ఉండవు. తూర్పు పడమర నలుపు తెలుపు భేదము లేదు. అందరికీ క్షమాపణ ఉంది.
అసలు సంగతి ఏమిటంటే - ప్రభువు మరల రాబోవుచున్నాడు. ఆ సమయంలో అసలు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మనము చేసిన మంచి చెడు అన్నీ ఉంటాయి. ఆలోచించండి. ఆ నీతి తీర్పులో మనము నిలువగలమా? ఒక్క దినంలో - వాస్తవానికి ఎన్ని తప్పులు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని దురాలోచనలు, ఎన్ని సణుగుళ్లు, ఎన్ని గొణుగుళ్లు ఉంటాయో కదా?! జీవితకాలమంతా ఇంకెన్ని ఉంటాయి? వాటన్నిటికి తీర్పు తీరిస్తే ఎవరు నిలువగలరు. అయితే క్రీస్తులో ఉన్నవారికి తీర్పు తీర్చబడదు. రోమా 8:1 క్రీస్తుయేసు నందున్న వారికి ఏ శిక్షా విధిలేదు. కాబట్టి క్రీస్తును కలిగి సత్యము ననుసరించి అందరినీ ప్రేమిస్తూ తీర్పు తీర్చకుండా పరిశుద్ధంగా జీవించుటకు ప్రభువు ఆత్మ మనకు తోడై నడిపించునుగాక. *

-మద్దు పీటర్ 9490651256