ప్రకాశం

రిమ్స్ ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 10: స్థానిక రిమ్స్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుజాతశర్మ రిమ్స్ డైరెక్టర్‌ను, అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించారు. రిమ్స్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు, వార్డులు పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యత తీసుకుని ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వ్యవస్థపై దృష్టిసారించి హాస్పిటల్‌కు వచ్చే రోగులకు మంచి వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వార్డుల్లో డస్ట్‌బిన్ క్లీనింగ్ చార్టులు విధిగా గోడలకు అతికించాలన్నారు. కలెక్టర్ పలువార్డుల్లో తిరిగి క్లీనింగ్ చార్టులను, మెనుచార్టులను మరుగుదొడ్లను పరిశీలించారు. పలువార్డుల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం గమనించి వెంటనే పరిశుభ్రంచేయాలని, మరుగుదొడ్లల్లోసక్రమంగా నీరు వచ్చేలా చూడాలని సూచించారు. పురుషుల ఆర్డోవార్డు, పురుషులు,స్ర్తిలు సర్జికల్ వార్డులు,ప్రత్యేక నవజాత శిశువుల చికిత్సా కేంద్రం, పోస్టు ఆపరేటివ్ వార్డులను కలెక్టర్, రిమ్స్ డైరక్టర్, ఒంగోలు ఆర్‌డిఒలతో కలిసి పర్యవేక్షించారు. వార్డుల్లో రోగులతో మాట్లాడుతూ భోజనం సరిగా అందుతున్నదిలేదా అని అడిగి తెలుసుకున్నారు. రోగుల దగ్గర కేసు షీట్స్ ఉండకపోవటం గమనించి ఇది మంచిపద్దతి కాదన్నారు.శానిటరీ ఇన్స్‌పెక్టర్ గురించి వాకాబు చేయగా ప్రస్తుతం విధుల్లో లేరని తెలపటంతో జిల్లాకలెక్టర్ ఎన్‌ఐసి ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలుపరిచేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సీజన్‌లో ఏ వ్యాధులపై రోగులుకు హాస్పటల్‌కు వస్తున్నారని కలెక్టర్ రిమ్స్ డైరక్టర్‌ను ప్రశ్నించగా వేడిగాలుల వలన జ్వరాలు వస్తున్న కేసులు అధికంకా ఉన్నాయన్నారు. పలువార్డుల్లో ఎసిలు పనిచేయకపోవటంపై కలెక్టర్ అసహానం వ్యక్తం చేశారు. ఎప్పటి నుండి ఎసిలు పనిచేయటంలేదని ప్రశ్నించగా రిమ్స్‌డైరక్టర్ రెండునెలల నుండి పనిచేయటం లేదని మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని కలెక్టర్‌కు వివరించారు. రిమ్స్ హాస్పిటల్, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు వైద్యాధికారులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాజబాబుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.