ప్రకాశం

మండపాలకు చేరిన గణనాథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, సెప్టెంబర్ 12: పిల్లలు, పెద్దలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయకచవితి పండుగ గురువారం కావడంతో ఊరువాడలు వినాయకచవితి శోభతో కళకళాలాడుతున్నాయి. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు సెలవు కావడంతో తమ సొంత ఊరిలోనే సంతోషంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో పండుగ శోభ వెల్లివిరిసింది. అదేవిధంగా గురువారం వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి అందులో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గత వారం రోజులుగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే యువత కేరింతల నడుమ డప్పు, మంగళ, వాయిద్యాలతో ప్రత్యేక వాహనాల్లో వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి తమ గ్రామాలకు తీసుకుని వెళ్లారు. ఇదిలాఉండగా పట్టణంలో వినాయకుని పూజించేందుకు అవసరం అయిన పత్రిక అమ్మకాలు బుధవారం మధ్యాహ్నం నుంచే జోరందుకున్నాయి. చిరు వ్యాపారులు వినాయక మట్టి ప్రతిమలను తయారు చేసి పట్టణంలో పోస్ట్ఫాస్ సెంటర్, అంకమ్మ దేవాలయం సెంటర్, మార్కెట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో విక్రయాలు చేపట్టారు. అదే విధంగా పట్టణంలోని పడమర బలిజపాలెం, ఎల్‌ఐసి ఆఫీస్ వద్ద, పామూరు రోడ్డు మలుపు వద్ద తదితర ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాలను వివిధ రూపాల్లో , ఆకృతుల్లో కళాకారులు గత రెండు నెలలుగా తయారు చేశారు. దీంతో ఆయా విగ్రహాలు వద్ద కొనుగోలు దారులతో కళకళలాడాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది విగ్రహాల ధరలు కొంత మేరకు తేడా ఉన్నప్పటికీ తమ శక్తి మేరకు విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గురువారం వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకోనున్నారు. పట్టణాలతో పాటుగా గ్రామాలలోనూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే వర్షాభావ పరిస్ధితుల ప్రభావం వలను వినాయకుని విగ్రహాల నిమజ్జనానికి కుంటలు, చెరువులు, బావుల్లోనూ నీరు అందుబాటులో లేదు. వినాయక నిమజ్జనాల కోసం ఈ ప్రాంతానికి సమీపంలో గల పాకల, ఊళ్ళపాలెం, బింగినపల్లి, రామాయపట్నం తదితర ప్రాంతాలలో బంగాళాఖాతానికి విగ్రహాలను నిమజ్జనాలు నిమిత్తం తీసుకుపోనున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు.