ప్రకాశం

చెవిలో చెప్పిన వెంటనే కోరికలు తీర్చే జువ్విళ్ళబావి గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, సెప్టెంబర్ 12: గిద్దలూరు నగరపంచాయతీలోని శర్మవీధిలోగల జువ్విళ్ళబావి విఘ్నేశ్వరుని బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వారంరోజులపాటు నిర్విఘ్నంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. పురాతనమైన ఈ విఘ్నేశ్వరుడు అదే ప్రాంతంలోని జువిళ్ళబావి నీటి మడుగు నుంచి లభించగా ఈయనను బావి ఒడ్డునే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఈ వినాయకుడు కాణిపాకం వినాయకుడిని పోలి ఉండటం, ఈ స్వామిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి చెవిలో కోర్కెలను చెప్పినవెంటనే భక్తుల కొంగుబంగారమై తీర్చేస్వామి. ఈవారంరోజులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు.
* ప్రత్యేక పూజలు అందుకోనున్న విఘ్నేశ్వరులు
నగరపంచాయతీలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద వినాయకుని విగ్రహాలను వివిధ రూపాల్లో గత మూడునెలలుగా తయారు చేశారు. ఈ విగ్రహాలన్నీ గురువారం పూజలు అందుకునేందుకు వివిధ గ్రామాలకు తరలివెళ్లాయి. ఈసందర్భంగా భక్తులు ప్రత్యేక వాహనాల్లో వినాయక విగ్రహాలను తరలించుకువెళ్లారు. షిరిడి సాయి ఆలయం వద్ద, రేడియోబావి సెంటర్‌లోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద మట్టివినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా అందచేశారు.