ప్రకాశం

చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, సెప్టెంబర్ 12 వినాయక చవితి ఉత్సవాల్లో యువత జోష్‌గా పాల్గొంటుండటంతో ఈ ఏడాది పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే పట్టణంలోని పలు కూడళ్లలో పోటాపోటీగా విగ్రహాలను ఏర్పాటు చేసి మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మున్సిపాలిటి పరిధిలో మొత్తం 60 పెద్ద విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేయగా అందులో గణేష్‌నగర్, రథంబజారు, రాజాజీవీధి, సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంతాల్లో లక్షల రూపాయల ఖర్చుతో భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీనితో బుధవారం సాయంత్రానికి సంబంధిత మండపాలకు గణనాథుల విగ్రహాలు చేరి చవితి పూజలకు సిద్ధమయ్యాయి. విఘ్నేశ్వర సేవాసంఘం ఆధ్వర్యంలో 34 పెద్దవిగ్రహాలను ఏర్పాటు చేయగా రోటరీక్లబ్, ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, స్వచ్ఛంద సేవాసంస్థల ఆధ్వర్యంలో మరికొన్ని విగ్రహాలు ప్రధానకూడళ్లలో కొలువుదీరాయి.
* వాసవీ విద్యానికేతన్‌లో ముందస్తు వేడుకలు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవాసవీ విద్యానికేతన్‌లో బుధవారం ముందస్తు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గణనాథుని వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అలరించగా యాజమాన్యం వినాయక చవితి విశిష్టతను వివరించారు. ఈసందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో వాసవీవిద్యాసంస్థల కార్యదర్శి గోళ్ళ సుబ్బరత్నం (బాబు)తోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.