ప్రకాశం

చింతలు తీర్చే వినాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల టౌన్, సెప్టెంబర్ 12: విజ్ఞానాలను తొలగించే తొలి గురువు వినాయకుడు హిందువులంతా ఏ పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నా తొలిగా నమస్కరించే దేవుడు వినాయకుడు వినాయకచవితి వచ్చిందంటే ప్రతి ఇంటి యజమాని గృహాన్ని పరిశుభ్రం చేసుకుని ఈ సంవత్సరం ఎటువంటి ఆటంకాలు కలగకుండా పిల్లాపాపలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ వినాయకునికి పూజలు చేస్తారు. ప్రజలంతా వినాయకచవితి రోజు నుంచి కార్యక్రమాలను వేగవంతం చేయడం కన్పిస్తుంది. అటువంటి వినాయకున్ని పూజించేందుకు రంగురంగుల చిన్ని వినాయకులను విక్రయదారులు అమ్మకానికి ఉంచారు. దాంతో ప్రజలు ఆ విగ్రహాలను కొనేందుకు, పూజా సామగ్రి కొనేందుకు పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. బుధవారం రద్దీగా ఉండడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. మార్కెట్ సెంటరు కొనుగోలు దారులతో హడావిడిగా కన్పించింది. ఏదీ ఏమైనా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని నాయకులు, అధికారులు, శుభాకాంక్షలు తెలిపారు.