ప్రకాశం

పెండింగ్‌లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 17: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మీకోసం అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో కలెక్టర్ వి వినయ్‌చంద్ జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ టి నిశాంతిలతోకలిసి మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 27473 మీకోసం అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అందులో 23363 అర్జీలు ఆర్ధికేతరమైనవి కాగా, 4110 అర్జీలు ఆర్ధికపరమైనవి ఉన్నాయన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఒల వద్ద అధికంగా అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇకనైనా అధికారులు ప్రత్యేక దృష్టిసారించి వచ్చే వారంలోగా అన్ని అర్జీలనలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల ఒకటవతేదీ నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం మొదలైందని, వచ్చే జనవరి ఒకటవతేదీ వరకు ఉందన్నారు. రాబోయే ఎన్నికలకు ముందు జరిగే చివరి సంక్షిప్త సవరణ కార్యక్రమం ఇదేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అర్హులైన వారందరిని ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేందుకు కోర్‌కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ సమావేశం త్వరలో నిర్వహిస్తామని, ప్రత్యేకంగా 18సంవత్సరాల నుండి 19సంవత్సరాల వయస్సు కలవారే లక్ష్యమని అందులో గిరిజనులపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్ల నమోదుకు విస్తత్రంగా ప్రచారం నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.