ప్రకాశం

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఘరానా మోసగాడు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 13: కలెక్టర్ పర్సనల్ సెక్రటరీనని కొందరిని నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తాని, భూమస్యను పరిష్కరిస్తానిని చెప్పి మోసం చేసి డబ్బులు వసూలు చేసిన గిద్దలూరు మండలం దిగువమిట్ట గ్రామానికి చెందిన ఒక ఘరానా మోసగాడు ముడుమాల డేవిడ్‌ను శుక్రవారం ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్‌చేసినట్లు ఒంగోలు పట్టణ డి ఎస్‌పి జి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి శ్రీనివాసరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ వూరే వెంకట రమణయ్య అనే వ్యక్తి ఒంగోలులోని పోస్టు ఆఫీసులో పోస్టుమేన్‌గా పనిచేసి గత సంవత్సరం పదవీవిరమణ చేయగా అతనికి భూవివాదం వుంది. అయితే దిగువమిట్ట గ్రామానికి చెందిన ముడుమాల డేవిడ్ అనే మోసగాడు తనకు తానుగా పోస్టుమేన్‌ను పరిచయం చేసుకోని తాను ప్రస్తుతం కలెక్టర్ పర్సనల్ సెక్రటరీనని చెప్పి సదరు వెంకట రమణయ్యకు చెందిన భూ వివాద సమస్యను తాను పరిష్కారం చేస్తానని చెప్పినట్లు తెలిపారు. అందుకు వెంకట రమణయ్య అంగీకరించినట్లు తెలిపారు. ఆ క్రమంలో సదరు డేవిడ్ బాధితుని దగ్గర నుండి పలు దఫాలుగా ఒక లక్షా 60వేల రూపాయలు నగదును తీసుకున్నట్లు డిఎస్‌పి తెలిపారు. అలాగే 27వేల రూపాయల విలువచేసే టివిని కూడా బాధితుని చేత కొనిపించి తీసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే సదరు బాధితుని అల్లుడైన ఆంజనేయ ప్రసాద్‌కు హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికినట్లు డిఎస్‌పి తెలిపారు. అలాగే వెంకట రమణయ్య గ్రామానికి చెందిన డి సుబ్బారావు అక్క కుమార్తెకి కూడా కలెక్టరేట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు తెలిపారు. చివరకు వెంకట రమణయ్య భూమి సమస్య పరిష్కారం కాకపోవడంతో అతనని గురించి విచారించగా సదరు డేవిడ్ అనే వ్యక్తి కలెక్టర్‌కి పర్సనల్ సెక్రటరీ కాదని అతను మోసం చేసాడని తెలుసుకోని ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సిఐ వై రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పై విషయాలన్ని వాస్తవమని, సదరు మోసగాడు డేవిడ్ తనకు ఎంతోమంది ప్రభుత్వ అధికారులు తెలుసునని చెప్పి మోసానికి పాల్పడినట్లు తేలిందని తెలిపారు. డేవిడ్ అనే అతను గతంలో ఎపిపి ఎస్‌సిలోఅవుట్‌స్సోర్సింగ్ పద్దతిలో అటెండర్‌గా పనిచేసిన కాలంలో ఉద్యోగాల కోసం వచ్చే వారు ఎంత ఇబ్బందులు పడతారో స్వయంగా చూసిన అనుభవంతో వీరిని అయితే సులభంగా ఎలా మోసం చేయాలో గ్రహించి ఇలాంటి మోసాలకు డేవిడ్ పాల్పడినట్లు తెలిపారు. డేవిడ్ విలాసాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించ వచ్చన్న ఉద్దేశ్యంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఎంచుకోని మోసాలకు పాల్పడుతున్నట్లు డిఎస్‌పి తెలిపారు. అలాంటి మోసగాడు అయిన డేవిడ్ ను ఒంగోలులోని భాగ్యనగర్‌లో ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సిఐ వై రామారావు ఆధ్వర్యంలో వారి పోలీసు సిబ్బంది శుక్రవారం అరెస్ట్ చేసి అతని వద్ద నుండి టివిని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పి తెలిపారు. డేవిడ్‌ను శుక్రవారం కోర్టుకు హాజరు పరచనున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం మాటలు చెబితే నిరుద్యోగు దళారుల చేతుల్లో మోసపోవద్దని సూచించారు. ఈ కేసులో డేవిడ్‌ను అరెస్ట్ చేసిన ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సిఐ రామారావుతోపాటు వారి సిబ్బందిని డి ఎస్‌పి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. విలేఖర్ల సమావేశంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సిఐ వై రామారావు పాల్గొన్నారు.