ప్రకాశం

అణగారిన బీసీలకు సముచిత స్థానం జగన్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 19:తరాల తరబడి వెనుకబాటుతనంతో జీవిస్తున్న వర్గాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటునందించాలంటే అది తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమని ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం స్థానిక ఎవన్ ఫంక్షన్‌హాలులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ బీసీ అధ్యయన కమిటీ సదస్సు జరిగింది. ఈసదస్సుకు కమిటి రాష్టక్రన్వీనర్ జంగా కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన సుబ్బారెడ్డి మాట్లాడుతూ వక్తలు సూచించిన అన్ని అంశాలను జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అవి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. జగన్ మాటిస్తే అది అమలు జరిగినట్లేనని కొనియాడారు. ఇప్పటివరకు ఏలిన ప్రభుత్వాలు బీసీల అభివృద్ధిని విస్మరించాయని, కేవలం వైఎస్ హాయంలోనే వాళ్ళ జీవితాల్లో కొంత వెలుగువచ్చిందన్నారు. ఎన్నికల్లో పోటీపడలేని సామాజిక వర్గాలకు శాసనమండలిలో సభ్యత్వం కల్పించటం ద్వారా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు కూడా ఎస్‌సి,ఎస్‌టిలకు మాదిరి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పటినుండో వెనుకబాటుతనంతో ఉన్న బీసీలను ప్రభుత్వంలో భాగస్వాములను చేయడమేకాక వారి అభివృద్ధికి బాటలు వేసేందుకు బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. బిసిల్లోవివిధ కులాలకు సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసి వారి సిఫార్సులను బీసీ గర్జన ద్వారా మ్యానిపెస్టోలో పొందుపరుస్తామన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాదిరిగానే జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని తెలిపారు. బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వక్తలు ఇచ్చిన అన్ని సూచనలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సదస్సులో వక్తలు తెలిపిన అన్ని అంశాలను వైకాపా బిసి అధ్యయన కమిటి రాష్టక్రన్వీనర్ జంగా కృష్ణమూర్తి సవివివరంగా విని వైకాపా అధినేత జగన్‌దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సదస్సులో సంతనూతలపాడు శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, పార్టీ రాష్ట్రఅధికారప్రతినిధి బత్తల బ్రహ్నాందారెడ్డి, గిద్దలూరు సమన్వయకర్త ఐవి రెడ్డి, కనిగిరి ఇన్‌చార్జీ బుర్రా మధుసూదన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్, బిసి అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య, చిమటా సాంబు, టి పుల్లయ్య, వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.