ప్రకాశం

- కోలలపూడి పంచాయతీలో కోటి రూపాయిలు నిరుపయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, సెప్టెంబర్ 21: గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పంచాయతీ వారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకపోవడం కోలలపూడి పంచాయతీలో చోటుచేసుకుంది. గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదంతో పంచాయతీ నిధులతో ఒక్క అభివృద్ధి కూడ జరగలేదంటే ఆ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ పంచాయతీలో వివిధ గ్రాంటుల ద్వారా ఇచ్చిన కోటి రూపాయిల నిధులు మూలుగుతున్నారు. గ్రామంలో కొన్ని రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉన్నాయి. సుమారు రూ.3వేల రూపాయిలు ఉన్న గ్రామ పంచాయతీలో జనాభా 5వేల వరకు ఉంది. ఒకప్పుడు టిడిపి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో కాలక్రమేనా నాయకుల మధ్య విభేదాలు ఏర్పడి గ్రామంలో వర్గాలు ఏర్పడ్డాయి. గడిచిన పంచాయతీ ఎన్నికల్లో వైసిపి మద్దతుదారుడు తాటి వరలక్ష్మి, టిడిపి మద్దతు దారుడుపై గెలుపొందారు. వార్డులు చరిసమానంగా వచ్చాయి. అయితే ఏడాది కాలంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీని వల్ల పంచాయతీ సమావేశాలు కూడా సజావుగా జరగలేదు. సమావేశాలు, తీర్మానాలు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు జరగకపోవడం గమనార్హం. 13, 14 ఆర్థిక సంఘ నిధులు, ఎన్ ఆర్ ఇజి ఎస్ నిధులు సుమారు కోటి రూపాయిల వరకు పంచాయతీకి వచ్చాయి. గ్రామంలో కొన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ ఒక రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు. దీనికి టిడిపి వర్గీయులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మాజీ సర్పంచి అడ్డు కంటుండగా సర్పంచి నిర్లక్ష్యం వల్ల గ్రామంలో అభివృద్ధి జరగలేదని టిడిపి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కోటి రూపాయిల నిధులు పంచాయతీ నిధుల ద్వారా గ్రామంలో అభివృద్ధి పనులు జరిపితే గ్రామం సర్వాంగ సుందరం ఉండేదని గ్రామస్థులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం పంచాయతీకి పాలకవర్గం కాలం ముగిసింది. ప్రతి పంచాయతీకి ప్రత్యేకాధికారులను నియమించారు. ఆ అధికారులైన ఈ నిధులను సద్వినియోగం చేస్తే గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కారమైతాయని గ్రామస్థులు అభిప్రాయ పడుతున్నారు.
నర్శింగోలులోని సిండికేట్ బ్యాంక్‌లో నకిలీ బంగారంపై రుణాలు
జరుగుమల్లి, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని నర్శింగోలు గ్రామంలో సిండికేట్ బ్యాంక్‌లో పనిచేస్తున్న వ్యక్తి తన బంధువుల చేత నకిలీ బంగారం పెట్టించి రుణాలు పొందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 20 రోజుల నుంచి సదరు వ్యక్తి విధులకు గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది. నర్శింగోలు పరిధిలోని దావగూడూరు, రెడ్డిపాలెం, నర్శింగోలు గ్రామాల్లో తన బంధువులచేత నకిలీ బంగారాన్ని పెట్టించి రుణాలు ఇప్పించి అవినీతికి పాల్పడినట్లు తెలిసింది. శుక్రవారం సిండికేట్ బ్యాంక్ ఉన్నతాధికారులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ నిర్వహించారు. సుమారు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు రుణం విలువ ఉంటుందని, ఈ నగదుతో జల్సాలు చేసినట్లు బృందసభ్యులు చెబుతున్నారు. మరో రెండు మూడు రోజులకు వరకు విచారణ జరుగుతుందన్నారు.
ఘనంగా మొహర్రం వేడుకలు
ఇంకొల్లు, సెప్టెంబర్ 21: మొహర్రం పండుగ శుక్రవారం ఇంకొల్లు మండలంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఇంకొల్లు, గంగవరం గ్రామంలో గల పీర్లచావిడిలో పీర్లను ఊరేగించారు. గురువారం అర్థరాత్రి నిప్పుల్లో నడిచి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఇంకొల్లులోని జెండా చెట్టు పక్కన అగ్ని గుండం ఏర్పాటు చేశారు
. శుక్రవారంతో పీర్ల పండుగ ముగియడంతో నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు చిన్నాపెద్దా అంతా తరలివెళ్లారు.

విభేదాలు వీడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
సంతమాగులూరు, సెప్టెంబర్ 21: గ్రామాలలో వర్గవిభేదాలు వీడి అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని, అప్పుడే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామేపల్లిలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు. గ్రామ కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని వీధుల్లో పర్యటించిన రవికుమార్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నిర్మించిన సిమెంటురోడ్లను, బీసీ కాలనీలో నిర్మించిన అంగన్‌వాడీ ప్రీస్కూల్ భవనాన్ని రవికుమార్ ప్రారంభించారు.
అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన గ్రామసభలో ప్రజలనుద్దేశించి రవికుమార్ ప్రసంగించారు. వివాదాలకు దూరంగా ఉండి అభివృద్ధికి పెద్దపీట వేస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో 10వేల సామాజిక పింఛన్లు నియోజకవర్గానికి మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సనె్నబోయిన ఏడుకొండలు, ఎంపీడీఓ జంగం రాజశేఖర్, మండల నాయకులు చింతా రామారావు, ఓరుగంటి కోటిరెడ్డి, బొమ్మిరెడ్డి శేషిరెడ్డి, కారసాని వెంకటకోటిరెడ్డి, చేవూరి వాసురెడ్డి, ఏలూరి శ్రీనివాసరావు, దుద్దేల చినగాలయ్య, కామాను శ్రీనివాసరావు, తేలప్రోలు రమేష్, వెల్లలచెరువు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండపునేని రామారావు, ఆంజనేయులు(బుల్లా), గుండపునేని సత్యనారాయణ, రామకృష్ణ, మాజీ సర్పంచ్ బాదినీడి చిన తిరుపతయ్య, తహశీల్దార్ నెహ్రూబాబు, వ్యవసాయ అధికారి వరప్రసాద్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శచీదేవి, వెలుగు ఏపీఎం హనుమంతరావు, మండల పరిషత్ ఏఈ ఈఎల్ వెంకటేశ్వర్లు అన్ని శాఖల అధికారులు, మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తాగునీటి ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మతులకు శ్రీకారం
యద్దనపూడి, సెప్టెంబర్ 21: మండల ప్రత్యేక అధికారి సుబ్రహమణ్నేశ్వరరావు చొరవతో ఏళ్లతరబడి పేరుకుపోయిన సమస్యకు పరిష్కారం లభించింది. మండలంలోని అనంతవరం గ్రామంలోని తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద తాగునీటి ఫిల్టర్‌బెడ్‌లు పూర్తిగా పూడిపోయి తాగునీరు సక్రమంగా ఫిల్టర్ కాక మురుగునీరు వస్తున్నాయని గ్రామస్థులు ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పట్ల స్పందించిన సుబ్రహమణ్యేశ్వరరావు శ్రీకారం చుట్టారు. గ్రామంలో 600 కుటుంబాలకు గ్రామంలోని తాగుకు, వాడుకకు చెరువునీరే ఆధారం. గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద రెండు ఫిల్టర్ బావులు ఉండా ఒక ఇటీవల మరమ్మతులు చేయగా, రెండోది పూర్తిగా దెబ్బతినడంతో ఎస్‌బిఎఫ్ నిధులు రూ.4 లక్షలు వెచ్చించి, 12 ఎం ఎం, 20 ఎం ఎం మెటల్, ఇటుక, ఇసుకతో బావుల్లోని పూడిక పూర్తిగా తీసి, బావిని శుభ్రం చేసి, ప్రాససింగ్ విధానంలో మరమ్మతులు చేశారు. మరమ్మతులు చేయడంతో గ్రామంలోని ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారమైతుందని ఆయన తెలిపారు. ఇటీవల సాగరు నీరు సక్రమంగా చేరకపోవడంతో పైపులైను మరమ్మతులు చేసి, ఇంజన్ల సాయంతో బంగారమ్మ చెరువు నింపేందుకు కృషి చేస్తున్నామని టిడిపి నాయకుడు గుదె తారకరామారావు అన్నారు. ప్రత్యేకాధికారి చొరవతో గ్రామంలోని తాగునీటి సమస్యకు పరిష్కారం లభించండంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు, ప్రత్యేకాధికారికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.