ప్రకాశం

అశ్రునయనాల మధ్య గిరిబాబు భార్య అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల, మే 13 : ప్రముఖ సినీనటుడు ఎర్రా గిరిబాబు భార్య శ్రీదేవి (70) అంత్యక్రియలు శుక్రవారం కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో బంధువులు, సన్నిహితులు, గ్రామ ప్రజల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. గత మూడు నెలలకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీదేవి హైదరాబాద్‌లోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందగా గురువారం ఆమె మృతదేహాన్ని రావినూతల గ్రామంలోని స్వగృహానికి తరలించారు. గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు గిరిబాబు బంధువులు, సన్నిహితులు, పలువురు రాజకీయ నాయకులు రావినూతల గ్రామానికి వచ్చి శ్రీదేవి మృతదేహానికి నివాళులు అర్పించి గిరిబాబును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గిరిబాబు దంపతులకు ఇరువురు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్ద కుమారుడు రఘుబాబు తండ్రి వారసత్వాన్ని స్వీకరించి పలు సినిమాల్లో క్యారెక్ట్ యాక్టర్‌గా నటిస్తూ గుర్తింపును తెచ్చుకున్నాడు. గిరిబాబు కుటుంబాన్ని గురువారం అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, జడ్పి చైర్మన్ ఈదర హరిబాబు, కొరిశపాడు తహశీల్దార్ పివి సాంబశివరావులు పరామర్శించగా శుక్రవారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, నియోజక వర్గ టిడిపి ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌తో పాటు పలువురు నియోజక వర్గ స్థాయి నాయకులు, పలు గ్రామాల్లోని గిరిబాబు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పరామర్శించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో శ్రీదేవి అంతిమ యాత్ర బంధువులు, పలువురు ప్రముఖులు, గ్రామస్థుల అశ్రునయనాల మధ్య సాగింది.