ప్రకాశం

భైరవకోన పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 24:్భరవకోన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు.సోమవారం సాయంత్రం తన ఛాంబర్‌లో వివిధ శాఖల సమన్వయంతో భైరవకోన పర్యాటక క్షేత్రం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భైరవకోన దేవాలయాన్ని సందర్శించే ప్రజల సౌకర్యం కోసం చేపట్టే పనులను వేగవంతం చేయాలన్నారు. టూరిస్టుల కోసం నిర్మించే భవనాలకు సంబంధించి శాఖల వారీగా పురోగతిపై చర్చించారు. డార్మిటరి రూంలు, సమ్మర్‌స్టోరేజి ట్యాంకులు, వాటర్‌పాల్స్, ఒపెన్‌ధియోటర్, గెస్ట్‌హౌస్‌తోపాటు సీసీ రోడ్లు, టెంపుల్ పార్కు, దేవాలయాల ప్రహరీగోడల పనులన్ని సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వెంటనే పనులు చేపట్టాలన్నారు. టూరిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనుల పురోగతిపై శ్రద్ధ వహించి చేయాలన్నారు. టూరిస్టుల కోసం నిర్మించే భవనాలకు సంబంధించి పనులపైర అలసత్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భైరవకోన సంబంధిత టూరిస్టులకోసం నిర్మించే భవనాలు సంక్రాంతి నాటికి అన్నిహంగులతో పూర్తిచేయాలన్నారు. నవంబర్ నుండి కార్తీకమాసం వస్తుందని ఆసమయంలో దేవాలయానికి ప్రజలు, టూరిస్టుల తాకిడి ఎక్కువుగా ఉంటుందని ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత ఇఒను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్‌శాఖ ఎస్‌ఇ రఘుబాబు, సిపిఒ వెంకటేశ్వర్లు, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఎస్‌ఇ సుబ్బరాజు, స్టెప్ సిఇఒ బి రవి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవరెడ్డి, జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.