ప్రకాశం

సంక్షేమ పాలన వైకాపాకే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, సెప్టెంబర్ 24: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పాలన సాధ్యం అని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం కోవూరు రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద నుంచి ఆర్టీసీ డిపో వరకు, సాయంత్రం ఉప్పుచెరువులో రావాలి జగన్ -కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజల సంక్షేమానికి తోడ్పడతాయన్నారు. నవరత్నాలు పథకంలో భాగంగా వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద చిన్న, సన్నకారు రైతులందరికీ రూ.50వేలు ఇస్తామన్నారు. అమ్మఒడి పథకం ద్వారా ఇంట్లో ఇద్దరు పిల్లలకు 5వ తరగతి వరకు నెలకు రూ.1000, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.1500, ఇంటర్‌కు రూ.2వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వైఎస్‌ఆర్ ఆసరా కింద మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. గృహాలు లేని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని, పింఛన్లు రూ.1000 నుంచి రూ.2వేలకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకం ద్వారా ప్రతి ఇంటికీ నెలకు రూ.4వేల నుంచి రూ.40వేల వరకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. ఓటును నోటుకు తాకట్టు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు రోడ్లు, డ్రైనేజీలు, రేషన్‌కార్డులు, నివేశన స్థలాలు, గృహాలు మంజూరు తదితర సమస్యలను మహీధర్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా వివరాలు నమోదు చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండయ్య, వేణుగోపాల్‌రెడ్డి, దారం మాల్యాద్రి, ఎం కృష్ణ, పసుపులేటి రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ కందుకూరి దీక్షితులు, ఖాదర్‌బాషా, నరసారెడ్డి, డి మాధవరెడ్డి, ఎం మనోహర్, ఆర్ మల్లికార్జున, జె కోటేశ్వరరావు, నారయ్య, జవహర్‌బాషా, సాహుల్, మునీర్, నాయబ్, జహీర్, ప్రకృద్దీన్‌ఆలీ తదితరులు పాల్గొన్నారు.